STOCKS

News


రుణ రేట్లను పెంచిన బీవోబీ

Thursday 6th September 2018
news_main1536208902.png-19994

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అన్ని రకాల కాల వ్యవధి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం మేర పెంచింది. ఇది ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.50 శాతం నుంచి 8.55 శాతం అయింది. పెంపు అనంతరం ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.40 శాతం, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.20 శాతానికి చేరాయి. గత వారం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా ఎంసీఎల్‌ఆర్‌ రేటును 0.20 శాతం వరకూ పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. 



You may be interested

ఎఫ్‌పీఐల ఆందోళనపై సెబీ దృష్టి

Thursday 6th September 2018

న్యూఢిల్లీ: కొత్త నిబంధనలపై విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో నెలకొన్న ఆందోళనలను తొలగించడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. వీటిపై ప్రభుత్వం సహా వివిధ వర్గాల అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాతే నిబంధనలను సమీక్షిస్తామని పేర్కొంది. ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ డిప్యుటీ గవర్నర్‌ హెచ్‌ఆర్‌ ఖాన్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌.. కేంద్ర ఆర్థిక శాఖతో సహా వివిధ వర్గాలతో చర్చలు జరిపిందని, ప్రస్తుతం

గురువారం వార్తల్లోని షేర్లు..!

Thursday 6th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు అరంబిందో ఫార్మా:- అమెరికాలో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు సండోజ్‌ కంపెనీ నుంచి 3 యూనిట్లను 900 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. బాంబే బుర్హాన్‌ ట్రేడింగ్‌:- కంపెనీ సీఈఓగా దీబర్‌ ఛటర్జీ నియమితులయ్యారు. పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌:- వేరువేరు క్లయింట్ల నుంచి రూ.226.07 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌:- తన అనుబంధ సంస్థ భారతీ టెలీ మీడియాలో వార్‌బర్గ్‌ సంస్థకు 20 వాటా విక్రయ

Most from this category