STOCKS

News


బంధన్‌ బ్యాంక్‌ లాభం 47 శాతం జంప్‌

Wednesday 10th October 2018
news_main1539161724.png-21018

ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌, క్యూ2) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్‌ నికర లాభం 47.4 శాతం వృద్ధితో రూ.488 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.331 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 55.6 శాతం వృద్ధితో రూ.1,078 కోట్లకు ఎగసింది. స్థూల ఎన్‌పీఏలు 1.29 శాతంగా ఉన్నాయి. జూన్‌ త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 1.26 శాతంగా నమోదయ్యాయి. అంటే స్థూల ఎన్‌పీఏలు త్రైమాసికం పరంగా స్థిరంగానే ఉన్నాయి. త్రైమాసికం పరంగా నికర ఎన్‌పీఏలు 0.6 శాతం నుంచి 0.7 శాతానికి పెరిగాయి. బ్యాంక్‌ కాసా రేషియో 36.9 శాతంగా ఉంది. క్యాపిటల్‌ అడక్వెసీ రేషియో 32.6 శాతంగా నమోదయ్యింది. బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ 9.3 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగింది. బంధన్‌ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 938 బ్రాంచ్‌లున్నాయి. 



You may be interested

ఎర్నింగ్స్‌ సీజన్‌ ఎలా ఉండొచ్చు?!

Wednesday 10th October 2018

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు క్యు2లో ఐటీ, కన్జూమర్‌గూడ్స్‌ రంగాల కంపెనీలు బలమైన ఎర్నింగ్స్‌ నమోదు చేస్తాయని, ఆటో, ఫార్మా, సిమెంట్‌ రంగాల కంపెనీలు ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. విద్యుత్‌ రంగ కంపెనీల ఫలితాలు ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. నిర్మాణ రంగంలో కంపెనీల ఆదాయాలు పెరిగినా ఎర్నింగ్స్‌ మందకొడిగానే ఉండొచ్చని తెలిపింది. వివిధ రంగాలపై బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయాలు.. ఐటీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ గూడ్స్‌: రూపాయి క్షీణత ఐటీ కంపెనీలకు కలిసిరావచ్చు.

రూపీ రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 10th October 2018

ముంబై:- కనిష్టస్థాయిల నుంచి రూపాయి రీకవరీ కారణంగా బుధవారం ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతంగా నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 74.39 వద్ద జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. పతనమవుతున్న  రూపాయిని ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థలో లిక్విటిడిని పెంచేందుకు ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.12వేల కోట్ల విలువైన బాండ్లను

Most from this category