STOCKS

News


బజాజ్‌ ఫైనాన్స్‌కు లాభాల బూస్ట్‌

Wednesday 24th October 2018
news_main1540360578.png-21428

ముంబై: నిర్వహణలోని ఆస్తుల్లో చక్కని వృద్ధి సాధించటంతో బజాజ్‌ ఫైనాన్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకంగా 54 శాతం పెరిగి రూ.923 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.598 కోట్లు. కన్సాలిడేటెడ్‌ ఆదాయం సైతం 40 శాతం వృద్ధితో కిందటేడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,066 కోట్ల నుంచి రూ.4,296 కోట్లకు వృద్ధి చెందింది. సబ్సిడరీ కంపెనీలైన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సెక్యూరిటీస్‌ ఫలితాలు కూడా ఇందులో కలిసే ఉన్నాయి. నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్‌ చివరికి రూ.1,00,217 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఏయూఎం రూ.72,669 కోట్లతో పోలిస్తే 38 శాతం వృద్ధి కనిపిస్తోంది. సెప్టెంబర్‌ క్వార్టర్లో బలమైన పనితీరు చూపించామని, నిర్వహణలోని ఆస్తులు 38 శాతం పెరిగాయని బజాజ్‌ ఫైనాన్స్‌ ఎండీ రాజీవ్‌జైన్‌ తెలిపారు. రుణాలపై నష్టాలు, కేటాయింపులన్నవి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.221 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెరిగాయి. స్థూల ఎన్‌పీఏలు 1.49 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.53 శాతంగా ఉన్నాయి. నిధుల సమీకరణ వ్యయం మార్పు లేకుండా 8.21 శాతంగా ఉంది. స్టాండలోన్‌ ఫలితాలను చూసుకుంటే బజాజ్‌ ఫైనాన్స్‌ నికర లాభం 55 శాతం పెరిగి రూ.920 కోట్లుగా ఉంది. బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం రూ.9 కోట్లుగా ఉంటే, నిర్వహణలోని ఆస్తులు రూ.10,712 కోట్లుగా ఉన్నాయి. బీఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌ 1.63 శాతం నష్టపోయి రూ.2,083.95 వద్ద క్లోజయింది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభంలో 20 శాతం వృద్ధి

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.287 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న నికర లాభం రూ.238.49 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం పెరిగింది. స్థూల ప్రీమియం సైతం రూ.5,636 కోట్ల నుంచి రూ.6,840 కోట్లకు వృద్ధి చెందింది. నికర ప్రీమియం ఆదాయం రూ.5,389 కోట్ల నుంచి రూ.6,777 కోట్లకు పెరిగింది. కంపెనీ పేరును హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌-1బీ వీసాల టాప్‌ 10లో టీసీఎస్‌

Wednesday 24th October 2018

వాషింగ్టన్‌: అమెరికా హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ 10 కంపెనీల్లో దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) చోటు దక్కించుకుంది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన 2018 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ మొత్తం 20,755 హెచ్‌-1బీ లేబర్ సర్టిఫికేషన్స్ పొందింది. 1,51,164 సర్టిఫికేషన్స్‌తో ప్రొఫెషనల్ సర్వీసెస్ దిగ్గజం ఎర్న్‌స్ట్‌ అండ్ యంగ్ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికా కార్మిక శాఖ ఒక నివేదికలో

Most from this category