STOCKS

News


బజాజ్‌ ఆటో లాభం రూ.1,408 కోట్లు

Saturday 18th May 2019
news_main1558153383.png-25814

  • ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్‌
  • ఎలక్ట్రిక్‌ వాహనాలపై కసరత్తు
  • కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మోటార్‌ బైక్‌ల అమ్మకాల జోరుతో బజాజ్‌ ఆటో కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 20 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.1,175 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,408 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఆటో తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,788 కోట్ల నుంచి రూ.7,395 కోట్లకు ఎగసిందని కంపెనీ ఈడీ రాకేశ్‌ శర్మ చెప్పారు. మొత్తం అమ్మకాలు 10.45 లక్షల యూనిట్ల నుంచి 14 శాతం వృద్ధితో 11.93 లక్షల యూనిట్లకు చేరాయని వివరించారు దేశీయంగా బైక్‌ల విక్రయాలు 4.97 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 6.10 లక్షలకు పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.60 డివిడెండ్‌ను(600 శాతం) ఇవ్వనున్నామని చెప్పారు. 
మోటార్‌ బైక్‌ల జోరు...
వాణిజ్య వాహనాలకు సంబంధించిన త్రీ వీలర్‌ సెగ్మెంట్‌లో సమస్యలున్నప్పటకీ, మోటార్‌ బైక్‌ల ముఖ్యంగా దేశీయ మోటార్‌ బైక్‌ సెగ్మెంట్‌ మంచి పనితీరు సాధించిందని రాకేశ్‌ శర్మ చెప్పారు. ఎంట్రీ లెవల్‌, టాప్‌ ఎండ్‌ ప్రీమియమ్‌ స్పోర్ట్స్‌ సెగ్మెంట్లలలో మంచి అమ్మకాలు సాధించామని పేర్కొన్నారు. బైక్‌ల ఎగుమతులు 3.58 లక్షల నుంచి 3.91 లక్షలకు పెరిగాయని వివరించారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 1.22 లక్షల నుంచి 16 శాతం తగ్గి 1,02 లక్షలకు పరిమితమయ్యాయని తెలిపారు. 
ఏడాది లాభం రూ.4,928 కోట్లు...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.4,219 ​కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధితో రూ.4,928 కోట్లకు పెరిగిందని రాకేశ్‌ శర్మ వివరించారు. మొత్తం ఆదాయం రూ.25,617 కోట్ల నుంచి రూ.30,250 కోట్లకు చేరింది. అమ్మకాలు 40.06 లక్షల నుంచి 25 శాతం వృద్ధితో 50.19 లక్షలకు పెరిగాయి. దేశీయ మార్కెట్లో మోటార్‌ బైక్‌ల అమ్మకాలు 19.74 లక్షల నుంచి 29 శాతం వృద్ధితో 25.41 లక్షలకు చేరాయని రాకేశ్‌ శర్మ పేర్కొన్నారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో ప్రస్తుత మోడళ్లలో అప్‌గ్రేడ్‌ వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. అన్ని విభాగాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతమున్న తమ మోడళ్లన్నింటినీ గడువులోగా బీఎస్‌-సిక్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా అందించనున్నామని పేర్కొన్నారు. 



You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ సక్సెస్‌

Saturday 18th May 2019

అధికంగా సబ్‌స్క్రిప్షన్లు వచ్చినట్టు కంపెనీ ప్రకటన న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూకు మంచి స్పందన వచ్చింది. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు రూ.25,000 కోట్ల రైట్స్‌ ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయినట్టు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మే 3న ఆరంభమైన రైట్స్‌ ఇష్యూ శుక్రవారంతో ముగిసినట్టు పేర్కొంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, చెల్లింపులు పూర్తయిన తర్వాత కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఒక్కో

ఫారెక్స్‌ నిల్వలు @ 420.05 బిలియన్‌ డాలర్లు

Saturday 18th May 2019

ముంబై: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) మే10వ తేదీతో ముగిసిన వారంలో 1.36 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 420.05 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 171.9 మిలియన్‌ డాలర్లు పెరిగి 418.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ)

Most from this category