STOCKS

News


విజయా బ్యాంక్‌తో బజాజ్‌ అలియాంజ్‌ జట్టు

Thursday 9th August 2018
news_main1533805463.png-19098

దేశీ ప్రముఖ ప్రైవేట్‌ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌.. ప్రభుత్వ రంగ విజయా బ్యాంక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా విజయా బ్యాంక్‌ తనకు దేశవ్యాప్తంగా 2,129 శాఖల్లో బజాజ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులను కస్టమర్లకు విక్రయించనుంది. దీని వల్ల ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద, ఇంటి, మోటార్‌, ట్రావెల్‌ బీమా సహా ప్రాపర్టీ, లయబిలిటీ, మెరైన్‌, ఇంజనీరింగ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులు బ్యాంక్‌ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. కాగా విజయా బ్యాంక్‌తో ఒప్పందం కారణంగా దక్షిణ భారతదేశంలో బజాజ్‌ అలియాంజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ బలోపేతం కానుంది. 



You may be interested

ఇమామి కొనొచ్చు..

Thursday 9th August 2018

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఇమామి ప్రస్తుత ధర: రూ.579 టార్గెట్‌ ప్రైస్‌: రూ.634 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఇమామి షేరు కొనుగోలు చేయవచ్చని సిపార్సు చేస్తోంది. కంపెనీ పనితీరుపై సానుకూలముగా ఉన్నామని పేర్కొంది. ఇమామి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో మంచి ఫలితాలను ప్రకటించిందని, ఇవి అంచనాలు అనువుగా ఉన్నాయని తెలిపింది. హోల్‌సెల్‌ సహా సీఎస్‌డీ వ్యాపార విభాగాల్లో రివకరీ అంచనా వేస్తున్నామని పేర్కొంది. అలాగే గ్రామీణ డిమాండ్‌ పెరుగుదల, కొత్త ప్రొడక్టుల

దివాలా కంపెనీలపై కుబేరుల మక్కువ

Thursday 9th August 2018

దివాలాప్రక్రియ ఎదుర్కొంటున్న పలు స్మాల్‌క్యాప్స్‌పై దేశీయ హెచ్‌ఎన్‌ఐలు(హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌) ఇటీవల కాలంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 22 చిన్న కంపెనీల్లో ఇటీవల కాలంలో హెచ్‌ఎన్‌ఐలు వాటా పెంచుకున్నారు. వీటిలో పలు కంపెనీలు దివాలా తీసినవి కావడం గమనార్హం. ఇవన్నీ ఆయా కోర్టుల ముందు విచారణలు ఎదుర్కొంటున్నాయి. మార్చి పతనం నుంచి ప్రధాన సూచీలు కోలుకున్నా స్మాల్‌క్యాప్‌ సూచీ మాత్రం ఇంకా ఆల్‌టైమ్‌ హై నుంచి 16 శాతం దిగువనే

Most from this category