STOCKS

News


ఆర్‌బీఐలో కేంద్రం జోక్యం వద్దు

Tuesday 30th October 2018
Markets_main1540879797.png-21580

- దాని స్వయంప్రతిపత్తిని కాపాడాలి
- కేంద్రానికి ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం హితవు

ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలంటూ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య తన గళాన్ని వినిపించిన రెండు రోజులకే.. ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం మద్దుతుగా ముందుకొచ్చింది. ఆర్‌బీఐ స్వతంత్రతను తక్కువ చేసి చూడడమే ఉపద్రవానికి కారణమని ఆల్‌ ఇండియా రిజర్వ్‌ బ్యాంకు అసోసియేషన్‌ పేర్కొంది. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని తగ్గించే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఓ లేఖలో కోరింది. ప్రభుత్వాలు కేంద్ర బ్యాంకు స్వతంత్రతను గౌరవించడం లేదని, ఫలితంగా ఫైనాన్షియల్‌ మార్కెట్ల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని విరాళ్‌ ఆచార్య ఇటీవలే హెచ్చరించారు. ‘‘ఆర్‌బీఐ విషయంలో ప్రభుత్వ జోక్యంపై విరాళ్‌ ఆచార్య వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా కలవరం నెలకొంది. కేంద్రం, ఆర్థిక శాఖ అదే పనిగా ఆర్‌బీఐ విషయంలో జోక్యం చేసుకుంటున్నందునే డిప్యూటీ గవర్నర్‌ అలా మాట్లాడారు’’ అని అసోసియేషన్‌ పేర్కొంది. సెంట్రల్‌ బ్యాంకు చేతులను కట్టేయరాదని కేంద్రానికి సూచించింది. నిపుణులు దీనిపై మాట్లాడాలని, ఆర్‌బీఐ తన విధులను తాను చేసుకునే విధంగా చట్ట సవరణ చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం కోరింది.



You may be interested

విదేశాలకూ వైశ్యా బిజినెస్‌ నెట్‌వర్క్‌

Tuesday 30th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన వైశ్య బిజినెస్‌ నెట్‌వర్క్‌ (వీబీఎన్‌)... విదేశాల్లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం 130 మంది సభ్యులతో రెండు చాప్టర్లను విజయవంతంగా కొనసాగిస్తున్నట్టు వీబీఎన్‌ ఫౌండర్‌ శివకుమార్‌ ఇమ్మడి సోమవారం మీడియాకు తెలిపారు. 2022 నాటికి భారత్‌లో 30, విదేశాల్లో 5 చాప్టర్లుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నెట్‌వర్క్‌ సభ్యుల రెఫరల్స్‌ ద్వారా గతేడాది రూ.1,000 కోట్ల వ్యాపారం జరిగిందని వీబీఎన్‌ సభ్యులు కౌటికె విఠల్‌

ఎన్‌పీఏల సమస్యలను అధిగమించే స్థాయికి బ్యాంకులు

Tuesday 30th October 2018

- తిరిగి లాభాల్లోకి వస్తున్నాయి - ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్య న్యూయార్క్‌: భారత బ్యాంకులు మొండి బకాయిల (ఎన్‌పీఏలు) సమస్యను అధిగమించే స్థాయికి వచ్చేశాయని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వస్తున్న ఫలితాలను బట్టి బ్యాంకులు తిరిగి లాభాల్లోకి వస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. గతేడాది బ్యాంకులు భారీ స్థాయిలో ఎన్‌పీఏల పెరుగుదల సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఎక్కువగా స్టీల్‌, విద్యుత్‌ రంగాలకు ఇచ్చిన రుణాల రూపంలో ఇది

Most from this category