STOCKS

News


83శాతం తగ్గిన యాక్సిస్‌ లాభం

Saturday 3rd November 2018
news_main1541230675.png-21683

  • మెరుగుపడిన రుణ నాణ్యత
  • తగ్గిన కేటాయింపులు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 83 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.432 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.790 కోట్లకు పెరిగిందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, రుణ నాణ్యత మెరుగుపడటంతో మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గాయని, దీంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.13,821 కోట్ల నుంచి రూ.15,959 కోట్లకు పెరిగిందని తెలిపింది.
నికర వడ్డీ ఆదాయం 15 శాతం అప్‌...
నికర వడ్డీ ఆదాయం రూ.2,208 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,542 కోట్లకు పెరిగిందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ2లో 3.12 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 2.54 శాతానికి తగ్గాయని పేర్కొంది.  అయితే స్థూల మొండి బకాయిలు మాత్రం 5.90 శాతం నుంచి 5.96 శాతానికి పెరిగాయని వివరించింది. మొండిబకాయిలకు, ఇతరాలకు కేటాయింపులు రూ.3,140 కోట్ల నుంచి 7 శాతం తగ్గి రూ.2,927 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఫీజు ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,376 కోట్లకు పెరిగిందని తెలిపింది. రిటైల్‌ బ్యాంకింగ్‌ సెగ్మెంట్‌ 24 శాతం వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. రుణాలు 11 శాతం పెరిగి రూ.4,56,121 కోట్లకు పెరిగాయని తెలిపింది. రిటైల్‌ రుణాలు 20 శాతం, ఎస్‌ఎమ్‌ఈ రుణాలు 14 శాతం, కార్పొరేట్‌ రుణాలు 21 శాతం చొప్పున పెరిగాయని వివరించింది.



You may be interested

రూ.813లు కోట్లు కట్టండి.

Saturday 3rd November 2018

సత్యం రామలింగరాజు తదితరులకు సెబీ తాజా ఆదేశాలు న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ. 813 కోట్లు కట్టాలంటూ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు తదితరులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. అలాగే 14 ఏళ్ల పాటు వారు సెక్యురిటీస్ మార్కెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా నిషేధం విధించింది. సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ సూచనల ప్రకారం సెబీ ఈ మేరకు కొత్తగా మళ్లీ ఆదేశాలు జారీ

12శాతం తగ్గిన ఐఓసీ లాభం

Saturday 3rd November 2018

రూ.3,246 కోట్లకు పరిమితం  కరెన్సీ మారక నష్టాలు, రిఫైనరీ మార్జిన్ల తగ్గుదల న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.3,246 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,696 కోట్లతో పోలిస్తే 12.6 శాతం తగ్గిపోయింది. విదేశీ మారక నష్టాలు, చమురు రిఫైనరీ మార్జిన్లు తగ్గుదల నికర లాభానికి చిల్లు పెట్టాయి. షేరు వారీ

Most from this category