STOCKS

News


ఆటోమేషన్ ఎనీవేర్‌కు 300 మిలియన్ డాలర్ల నిధులు

Saturday 17th November 2018
news_main1542432647.png-22123

న్యూఢిల్లీ: రోబోటిక్ ప్రాసెస్‌ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) సేవలు అందించే ఆటోమేషన్ ఎనీవేర్ సంస్థ తాజాగా 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,154 కోట్లు) సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్ నుంచి ఈ నిధులు పొందినట్లు తెలియజేసింది. మానవ ప్రమేయం అవసరమైన కార్యకలాపాలను కూడా సాఫ్ట్‌వేర్ రోబోలతో ఆటోమేటిక్‌గా నిర్వహించుకోగలిగేలా చేసుకునేందుకు తోడ్పడే సాంకేతికతను ఆర్‌పీఏగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది జూలైలోనే న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్, గోల్డ్‌మాన్ శాక్స్ గ్రోత్ ఈక్విటీ మొదలైన వాటి నుంచి 250 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు ఆటోమేషన్ ఎనీవేర్‌ సీఈవో మిహిర్ శుక్లా వెల్లడించారు. మొత్తం మీద దాదాపు 500 మిలియన్ డాలర్ల నిధులు సమకూరడంతో.. తమ క్లయింట్లకు మరింత మెరుగైన సొల్యూషన్స్ అందించగలమని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

మహీంద్రా ‘మారాజో’ ధరల పెంపు

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవలే విడుదల చేసిన ‘మారాజో’ బహుళ వినియోగ వాహనం ధరలను రూ.30,000-40,000 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రూ.9.99 లక్షల నుంచి రూ.13.90 లక్షల ధరల శ్రేణితో మారాజోను ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహీంద్రా మార్కెట్లోకి విడుదల చేసింది. ‘‘ఇది పరిచయ ధర మాత్రమేనని విడుదల సందర్భంలో చెప్పాం. విడుదల చేసిన

మింత్రాలో జబాంగ్‌ విలీనం..

Saturday 17th November 2018

ముంబై: ఆన్‌లైన్‌ ఫ్యాషన్ రిటైల్‌ సంస్థ మింత్రాలో అనుబంధ సంస్థ జబాంగ్‌ విలీనం కానుంది. విలీనమైనప్పటికీ.. జబాంగ్ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగుతుందని మింత్రా తెలిపింది. రెండు సంస్థల టీమ్‌కు ప్రస్తుత మింత్రా సీఈవో అనంత్‌ నారాయణనే సారథిగా కొనసాగుతారు. ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలను మింత్రా తోసిపుచ్చింది. ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2014లో మింత్రాను కొనుగోలు చేసింది. 2016లో జబాంగ్‌ను మింత్రా కొనుగోలు చేసింది. అప్పట్నుంచి రెండు బ్రాండ్స్‌

Most from this category