STOCKS

News


యూఎస్‌ కంపెనీతో అరబిందో రూ.2,100 కోట్ల డీల్‌

Friday 18th January 2019
Markets_main1547788677.png-23651

ఏడు ఆంకాలజీ ఉత్పాదనల కొనుగోలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్‌కు చెందిన స్పెక్ట్రమ్‌ ఫార్మాస్యూటికల్స్‌ నుంచి ఏడు బ్రాండెడ్‌ ఆంకాలజీ ఇంజక్టబుల్‌ ఉత్పాదనలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు స్పెక్ట్రమ్‌ ఫార్మాతో అరబిందో అనుబంధ కంపెనీ అక్రోటెక్‌ బయోఫార్మా ఎల్‌ఎల్‌సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.2,100 కోట్లపైమాటే. వ్యూహంలో భాగంగా యూఎస్‌ మార్కెట్లో బ్రాండెడ్‌ ఆంకాలజీ విభాగంలో అరబిందో ప్రవేశం, విస్తరణకు ఈ డీల్‌ దోహదపడుతుందని ఈ సందర్భంగా సంస్థ ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ వ్యాఖ్యానించారు. ఉత్పత్తులు కంపెనీ చేతికి వచ్చిన తొలి ఏడాది వీటి నుంచి సుమారు రూ.700 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్టు చెప్పారు. అరబిందో కొనుగోలు చేస్తున్న ప్రొడక్టులకు యూఎస్‌లో మంచి గుర్తింపు ఉంది.



You may be interested

బైజూ చేతికి అమెరికన్‌ కంపెనీ ఓస్మో

Friday 18th January 2019

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ విద్యా సంస్థ బైజూస్‌ అమెరికాకు చెందిన ఓస్మో కంపెనీని 120 మిలియన్‌ డాలర్లకు (రూ.850 కోట్లు) కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఆటలతో కూడిన విద్యా విధానాలను ఓస్మో అందిస్తుంటుందని, భౌతిక రూపంలో ఉన్న బొమ్మలను ఆగ్మెంటెడ్‌ రియాలిటీ విధానంలో డిజిటల్‌ ప్రపంచంలోకి తీసుకురానున్నమని తెలిపింది. ఓస్మో స్వతంత్ర బ్రాండ్‌గానే కొనసాగుతుందని బైజూన్‌ ప్రకటించింది. అయితే, భౌతిక రూపం నుంచి డిజిటల్‌ రూపంలోకి మార్చే ఓస్మో సామర్థ్యాలు, కంటెంట్‌ను

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,444 కోట్లు

Friday 18th January 2019

నికర అమ్మకాలు 12 శాతం అప్‌ 22  శాతం వృద్ధితో రూ.2,046 కోట్లకు ఎబిటా ఐదో క్వార్టర్‌లోనూ రెండంకెల అమ్మకాల వృద్ధి న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,444 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,326 కోట్ల నికర లాభం వచ్చిందని, 9 శాతం వృద్ది సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండటం, మార్జిన్లు

Most from this category