STOCKS

News


అమెరికా మార్కెట్‌ నుంచి అరబిందో ఔషధం వెనక్కి

Monday 5th November 2018
news_main1541394060.png-21707

హైదరాబాద్‌: అధిక రక్తపోటు చికిత్సలో వినియోగించే ఇర్బెసర్టాన్‌ అనే ఔషధ ముడి పదార్థాన్ని అమెరికా మార్కెట్‌ నుంచి అరబిందో ఫార్మా స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంది. 22 బ్యాచ్‌ల ఔషధాల్లో కేన్సర్‌ హానికారకం ఉండడంతో ఉపసంహరించుకున్నట్టు యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపింది. కొన్ని రకాల ఆహారం, తాగే నీరు, వాయు కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాల్లో ఉండే ఎన్‌-నైట్రోసోడిథలమైన్‌ (ఎన్‌డీఈఏ) అనే మలినం మనుషుల్లో కేన్సర్‌కు దారితీయవచ్చని ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కేన్సర్‌ ప్రకటించినట్టు యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. అరబిందో ఫార్మా అమెరికాలోని సీజెన్‌ ఫార్మాస్యూటికల్స్‌కు సరఫరా చేసిన ఇర్బెసర్టాన్‌ ముడి పదార్థంలో ఈ హానికారకం ఉన్నట్టు గుర్తించడంతో ఉపసంహరించుకుంది. అరబిందో సరఫరా చేసిన ముడి పదార్థం ఆధారంగా సీజెన్‌ తుది ఉత్పత్తిని తయారు చేసి అమెరికా మార్కెట్లో విక్రయిస్తుంటుంది. మరోవైపు సీజెన్‌ సైతం మార్కెట్‌ నుంచి ఇర్బెసర్టాన్‌ ఔషధాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపింది. 



You may be interested

అంతర్జాతీయ ట్రెండ్‌ ఆధారం

Monday 5th November 2018

న్యూఢిల్లీ: రూపాయి రికవరీ, చమురు ధరలు దిగిరావడం, అమెరికా-చైనా మధ్య సయోధ్యకు అవకాశాలు, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు భారత్‌కు అవకాశం కల్పించడం, గత వారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. అయితే, ఈ వారంలో అమెరికాలో జరగబోయే ఎన్నికలు, ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం వంటి అంశాల ఆధారంగా నెలకొనే అంతర్జాతీయ ట్రెండ్‌ మన మార్కెట్‌కు కీలకం కానుందని,

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 5th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- జీడిమెట్లలో ఉన్న ముడి ఔషధాల (యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌-ఏపీఐ) తయారీ యూనిట్‌ విక్రయ ప్రక్రియను పూర్తి చేసింది. స్టెరైడ్‌ ఫార్మా సైన్స్‌:- ఇటీవల బెంగళూర్‌లో యూనిట్‌లో తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ప్లాంట్‌కు ‘‘జీరో’’ అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు కంపెనీల స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌:- ఆర్థిక మంత్రిత్వశాఖ డిసెంబర్‌ 15న నాటికి రూ.54వేల మూలధన

Most from this category