అపోటెక్స్ వ్యాపారం అరబిందో చేతికి...
By D Sayee Pramodh

కెనెడాకు చెందిన జెనరిక్స్ ఉత్పత్తిదారు అపోటెక్స్‌కు చెందిన ఐదు దేశాల వ్యాపారాన్ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ఈ మేరకు అపోటెక్స్‌తో అరబిందో అనుబంధ సంస్థ ఎగెల్ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 7.4 కోట్ల యూరోలు. ఈ ఆల్‌క్యాష్ (ఎటువంటి రుణాలు లేకుండా మొత్తం నగదు రూపంలో అందిచడం)ఒప్పందంలో భాగంగా పోలెండ్, చెక్, నెదర్లాండ్స్, స్పెయిన్, బెల్జియం దేశాల్లో అపోటెక్స్ వ్యాపారం(వాణిజ్య కార్యకలాపాలు, ఇన్ఫ్రా) అరబిందో చేతికి వస్తుంది. ఒప్పందానికి డచ్, పోలాండ్ అథార్టీల నుంచి అనుమతులు రావాల్సిఉంది. అన్ని అడ్డంకులు దాటి వచ్చే ఆరు నెలల్లో డీల్ పూర్తవుతుందని అంచనా. తమ వ్యూహాలకు అనుగుణంగా తాజా కొనుగోలు చేపట్టామని, దీంతో యూరప్‌లో తమ వ్యాపారం మరింత విస్తృతమవుతుందని అరబిందో వైస్ప్రెసడెంట్ వీ. మురళీధరన్ చెప్పారు. నెదర్లాండ్స్‌తో పాటు తూర్పు యూరప్‌లో మరిన్ని ఓటీసీ ఔషధులను పోర్టుఫోలియోలో చేర్చేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం ఈ ఐదు దేశాల అపోటెక్స్ పోర్టుఫోలియోలో 200కు పైగా ప్రిస్క్రైబ్డ్ మందులు, 88 ఓటీసీ ఉత్పత్తులున్నాయి. త్వరలో మరో 20 ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఈ ఐదుదేశాల్లో అపోటెక్స్ నికర విక్రయాలు 13.3 కోట్ల యూరోలు. యూరప్‌లో గత పుష్కరకాలంగా అరబిందో విస్తరిస్తూ వస్తోంది. ఇందుకు అటు కొత్త కంపెనీలు కొనుగోలు చేయడం, వేరే కంపెనీలతో డీల్స్ కుదుర్చుకోవడం సహా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గతేడాది పోర్చుగల్‌కు చెందిన జెనిరిస్ఫార్మాసూటికాను, 2014లో ఏడు యూరప్ దేశాల్లో ఆక్టావిస్ వాణిజ్య కార్యకలాపాలను కొనుగోలు చేసింది.
You may be interested
బైబ్యాక్‌పై పీసీ జువెలరీస్ రివర్స్ గేర్
Saturday 14th July 2018గతంలో ప్రకటించిన రూ. 424 కోట్ల రూపాయల బైబ్యాక్ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు పీసీజువెలరీస్ ప్రకటించింది. బైబ్యాక్‌కు తమ బ్యాంకర్ నుంచి ఓన్ఓసీ పొందడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ బోర్డు ప్రకటించింది. తమ రుణాల కారణంగా బైబ్యాక్‌కు బ్యాంకర్ అనుమతి తప్పనిసరని ఎక్చేంజ్‌లకు కంపెనీ వెల్లడించింది. ఇకమీదట వ్యాపార వృద్ధిపై శ్రద్ధ పెట్టాలని, వడ్డీ వ్యయాలను తగ్గించుకోవడానికి యత్నించాలని బ్యాంకరు సూచించినట్లు వెల్లడించింది. రుణభారంతో ఉన్న సమయంలో అసలు
పర్యాటక రంగ స్టాకులను పట్టేయండి
Saturday 14th July 2018దేశీయ ఎకానమీ బలోపేతం కావడంలో, ఉపాధి కల్పనలో టూరిజం కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలోకి విదేశీ పర్యాటకుల సంఖ్య క్రమాగనుగత వృద్ధి నమోదు చేస్తోంది. ఇతర దేశాలతో పోటీగా భారత్‌లో సైతం ప్రభుత్వం పలురకాల టూరిజం మోడళ్లను అభివృద్ధి చేస్తోంది. మెడికల్ టూరిజం, వెల్నెస్ టూరిజం, కల్చరల్ టూరిజం, అడ్వంచర్ టూరిజం, క్రూయిజ్ టూరిజం లాంటి పలు మోడళ్లు అమిత జనాకర్షణ చేస్తున్నాయి. పలు పురాతన ప్రదేశాలను