STOCKS

News


12 శాతం తగ్గిన అరబిందో లాభం

Friday 10th August 2018
news_main1533896653.png-19130

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అరబిందో ఫార్మా నికరలాభం క్రితంతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ.455.7 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 15.5 శాతం అధికమై రూ.4,250 కోట్లకు ఎగసింది. ఎబిటా 18.3 శాతంగా ఉంది. యూఎస్‌, యూరప్‌ మార్కెట్‌ జోష్‌ కంపెనీకి తోడైంది. యూఎస్‌ ఫార్ములేషన్ అమ్మకాలు 11.5 శాతం అధికమై రూ.1,890 కోట్లు, యూరప్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు 30.7 శాతం వృద్ధితో రూ.1,199 కోట్లు నమోదైంది. ఏపీఐల విక్రయం ద్వారా రూ.748 కోట్లు సమకూరింది. పరిశోధన, అభివృద్ధికి రూ.169 కోట్లు వ్యయం చేశారు. యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి 13 ఏఎన్‌డీఏలకు తుది, 3 ఏఎన్‌డీఏలకు తాత్కాలిక అనుమతులు దక్కించుకుంది. కొన్ని రకాల ఉత్పాదన సంబంధ నిబంధనల మూలంగా లాభంపై ప్రభావం చూపిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



You may be interested

ఐపీవోకు దొడ్ల డెయిరీ

Friday 10th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పాలు, పాల ఉత్పత్తుల విక్రయ కంపెనీ దొడ్ల డెయిరీ ఐపీవోకు రానుంది. ఈ మేరకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా  రూ.150 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితోపాటు కంపెనీ షేర్‌హోల్డర్లు టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌, దొడ్ల దీపా రెడ్డి 95,43,770 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తారు. ఐపీవో సైజు సుమారు

12 శాతం తగ్గిన అరబిందో లాభం

Friday 10th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అరబిందో ఫార్మా నికరలాభం క్రితంతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ.455.7 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 15.5 శాతం అధికమై రూ.4,250 కోట్లకు ఎగసింది. ఎబిటా 18.3 శాతంగా ఉంది. యూఎస్‌, యూరప్‌ మార్కెట్‌ జోష్‌ కంపెనీకి తోడైంది. యూఎస్‌ ఫార్ములేషన్ అమ్మకాలు 11.5 శాతం అధికమై రూ.1,890 కోట్లు, యూరప్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు 30.7 శాతం వృద్ధితో రూ.1,199

Most from this category