STOCKS

News


ఆసుస్‌ ‘బ్యాక్‌ టు కాలేజ్‌’ ఆఫర్‌

Thursday 9th August 2018
news_main1533810302.png-19106

కుర్ర కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసుస్‌సంస్థ బ్యాక్‌ టు కాలేజ్‌తో పాటు పలు ఆఫర్లను ప్రకటించింది.
బ్యాక్‌ టు కాలేజ్‌ ఆఫర్‌: ఈ ఆఫర్‌లో భాగంగా ఆసుస్‌ సంస్థ నోట్‌బుక్స్‌ కొనుగోలు చేసినవారికి వారెంటీ పొడిగింపు ఉంటుంది. ఆసుస్‌నోట్‌ బుక్‌ కొనుగోలు దారులు రూ. 499, గేమింగ్‌ నోట్‌బుక్‌ కొనుగోలుదారులు రూ. 999 చెల్లించి రెండేళ్ల వారెంటీ, రూ. 999, రూ. 1499 చెల్లించి మూడేళ్ల వారెంటీ పొడిగింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 30 వరకు అందుబాటులో ఉంటుంది. 
బజాజ్‌ ఈఎంఐ ఆఫర్‌: ఆసుస్‌ పీసీలను ఈ ఆఫర్‌లో జీరో కాస్ట్‌తో ఈఎంఐలు పద్ధతిలో పొందవచ్చు. యూజర్లు 3 ఈఎంఐలకు సరిపడ మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఆరు ఈఎంఐల్లో చెల్లించాల్సిఉంటుంది. 
కస్టమైజ్డ్‌ ఆర్‌ఓజీ ఆఫర్‌: ఆర్‌ఓజీ గేమింగ్‌ సీరిస్‌ మోడల్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆర్‌ఓజీ టీ షర్ట్‌ ఉచితంగా ఇస్తారు. దీనిపై యూజర్‌ పేరు ప్రింట్‌ చేసి ఉంటుంది. 

 



You may be interested

పేటీఎం మాల్‌ నుంచి ఫ్రీడమ్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ ఆఫర్‌

Thursday 9th August 2018

పండుగ సీజన్‌ అమ్మకాలను పేటీఎం మాల్‌ ఆరంభించింది. ఫ్రీడమ్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ ఆఫర్‌ పేరిట కొత్త సీజన్‌ను షురూ చేసింది. ఈ నెల 8 నుంచి 15 మధ్యన ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆఫర్‌లో భాగంగా మొబైల్స్‌, ఫాషన్‌, అప్లయెన్సెస్‌, ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కిచెన్‌ అండ్‌ హోమ్‌ తదితర విభాగాలకు చెందిన పది కోట్ల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ కోసం పేటీఎం మాల్‌

ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ కొత్త టర్మ్‌ ప్లాన్‌

Thursday 9th August 2018

ఎడిల్‌వైజ్‌ గ్రూప్‌, టోకియో మెరైన్‌ హోల్డిం‍గ్స్‌ జాయింట్‌ వెంచరే ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. కస్టమర్ల కోసం ‘జిందగి పల్స్‌’ అనే కొత్త ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది టర్మ్‌ ప్లాన్‌. కస్టమర్లకు సంబంధించి మారుతున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనువుగా సమగ్రమైన రక్షణే లక్ష్యంగా కంపెనీ ఈ పాలసీని ఆవిష్కరించింది. జిందగి ప్లస్‌లో బెటర్‌ హాఫ్‌ బెనిఫిట్‌, సమ్‌ అస్యూర్డ్‌ తగ్గుదల అనే రెండు ప్రధాన పీచర్లుంటాయని పేర్కొంది. బెటర్‌

Most from this category