STOCKS

News


ఆసియాకే కుబేరుడు అంబానీ

Tuesday 25th December 2018
news_main1545720548.png-23215

  • ఆలీబాబా జాక్‌మాను దాటిన ముకేష్
  • 4 బిలియన్ డాలర్లు పెరిగిన సంపద

న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో చైనాకి చెందిన ఈ- కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ చీఫ్ ‘జాక్‌ మా’ను కూడా అధిగమించారు. వార్షికంగా చూస్తే.. మిగతా సంపన్నుల సంపద కరిగిపోతున్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పరుగుల కారణంగా ముకేష్ అంబానీ సంపద మాత్రం 4 బిలియన్ డాలర్ల మేర పెరిగి సుమారు 43.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అటు జాక్‌ మా సంపద 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018లో ఆసియాలో 128 మంది కుబేరుల సంపద 137 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. ర్యాంకింగ్‌లు ప్రారంభించిన 2012 సంవత్సరం నాటి నుంచి చూస్తే ఆసియా సంపన్నుల సంపద ఇలా తగ్గిపోవడం ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, షేర్ల విలువలు అనుచిత స్థాయులకు పెరిగిపోయాయన్న ఆందోళనలు.. ఇందుకు కారణమయ్యాయి.

   చైనాతో పాటు భారత్‌, దక్షిణ కొరియా దేశాల సంపన్నులపై ఎక్కువగా ప్రభావం పడింది. బ్లూమ్‌బర్గ్‌ సూచీలో ర్యాంకింగ్ పొందిన 40 మంది చైనా సంపన్నుల్లో మూడింట రెండొంతుల మంది సంపద తగ్గిపోయింది. లిస్టులో భారతీయ కుబేరులు 23 మంది ఉండగా.. వారి సంపద 21 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ఉక్కు దిగ్గజం అర్సెలర్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నికర విలువ అత్యధికంగా 29 శాతం మేర (5.6 బిలియన్ డాలర్లు) కరిగిపోయింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద జనరిక్స్ తయారీ దిగ్గజం సన్‌ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి సంపద 4.6 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.



You may be interested

కార్పోరేషన్‌ బ్యాంకు ఎండీగా పీవీ భారతి

Tuesday 25th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా పి.వి.భారతి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారతి ప్రస్తుతం కెనరాబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 1, ఆ తర్వాత ఆమె నూతన బాధ్యతలు స్వీకరిస్తారని, 2020 మార్చి 31 వరకు కార్పొరేషన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో బాధ్యతల్లో ఉంటారని కేంద్రం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, కార్పొరేషన్‌ బ్యాంకు

6నెలల గరిష్టానికి పసిడి

Tuesday 25th December 2018

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న అనిశ్చితికి డాలర్‌ బలహీనత తోడవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 6నెలల గరిష్టానికి చేరుకుంది. రాత్రి అమెరికాలో 14.50 డాలర్లు లాభపడి 1,272.50 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌ కావడం, ఫెడ్‌ రిజర్వ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ప్రయత్నాలతో పాటు ఆర్థిక వృద్ధి మందగమన భయాలు మితిమీరిన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో అనిశ్చితి వాతావరణం నెలకొంది.

Most from this category