STOCKS

News


ఏషియన్‌ పెయింట్స్‌ లాభం రూ.506 కోట్లు

Tuesday 23rd October 2018
news_main1540271337.png-21395

న్యూఢిల్లీ: ఏషియన్‌ పెయింట్స్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.506 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో  రూ.594 కోట్ల నికర లాభం ఆర్జించామని ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. నిలిపేసిన కార్యకలాపాల గణాంకాలు కూడా ఉన్నందున గత క్యూ2 నికర లాభాన్నీ, ఈ క్యూ2 నికర లాభాలతో పోల్చకూడదని పేర్కొంది.  మొత్తం ఆదాయం మాత్రం రూ.4,328 కోట్ల నుంచి 9 శాతం వృద్ధి చెంది రూ.4,702 కోట్లకు ఎగసింది. దీంట్లో పెయింట్స్‌ విభాగం ఆదాయం రూ.4,537 కోట్లుగా, హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ విభాగం ఆదాయం రూ.102 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. మొత్తం వ్యయాలు రూ.3,571 కోట్ల నుంచి 11 శాతం పెరిగి రూ.3,962 కోట్లకు చేరాయి. ఎబిటా రూ.801 కోట్ల నుంచి రూ.784 కోట్లకు తగ్గిందని, ఎబిటా మార్జిన్‌ 18.8 శాతం నుంచి 16.9 శాతానికి తగ్గింది.
ఈ నెల నుంచి ధరలు పెరిగాయ్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.2.85 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌  ఆమోదం తెలిపింది. ఇక నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మనీశ్‌ చోక్సీని నియమించామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. భారత్‌లో డెకరేటివ్‌ వ్యాపార విభాగం అంతంమాత్రం వృద్ధిని సాధించిందని పేర్కొంది. ముడి పదార్ధాల ధరలు పెరుగుతుండటంతో ఈ నెల నుంచి తమ ఉత్పత్తుల ధరలను  పెంచక తప్పలేదని వివరించింది. నికర లాభం 15 శాతం తగ్గడంతో  ఏషియన్‌ పెయింట్స్‌ షేర్‌ నష్టపోయింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ 2.9 శాతం నష్టంతో రూ.1,201 వద్ద ముగిసింది. 


 



You may be interested

సైయంట్‌ బోర్డ్‌లో ఇద్దరు కొత్త డైరెక్టర్లు

Tuesday 23rd October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయంట్‌ బోర్డ్‌లో కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు నియమితులయ్యారు. వికాస్‌ సెహగల్, పీటర్‌ ఎఫ్‌ లాంగో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. పీటర్‌ లాంగో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా ఉండటమే కాక సైయంట్‌ చైర్మన్‌గానూ కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. వీళ్లిద్దరితో కలిపి ప్రస్తుతం సైయంట్‌ బోర్డ్‌లో డైరెక్టర్ల సంఖ్య 10కి చేరింది. 

దేశీ బ్యాంకుల లాభం.. అంతంతే!

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే, అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. "కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల‍్లో ఒత్తిళ్ల కారణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ బలహీనంగా ఉంది. అయితే,

Most from this category