STOCKS

News


అశోక్‌ లేలాండ్‌ ఆదాయం 25 శాతం అప్‌

Wednesday 14th November 2018
news_main1542173359.png-21979

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 37 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.334 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.460 కోట్లకు పెరిగిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.6,076 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.7,608 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ వినోద్‌ కె. దాసరి వెల్లడించారు. ఎబిటా 32 శాతం పెరిగి రూ.806 కోట్లకు పెరిగిందని, అలాగే నిర్వహణ మార్జిన్‌ అర శాతం పెరగి 10.6 శాతానికి చేరిందని తెలిపారు. పోటీ తీవ్రం‍గా ఉన్నా, అనేక సవాళ్లున్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటం కొనసాగుతున్నప్పటికీ, పటిష్టమైన వ్యయ నియంత్రణ విధానాలతో ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ సీఎఎఫ్‌ఓ గోపాల్‌ మహదేవన్‌ పేర్కొన్నారు.  
సీఈఓ పదవికి వినోద్‌ రాజీనామా
14 ఏళ్లుగా అశోక్‌ లేలాండ్‌ కంపెనీలో వివిధ హోదాల్లో విజయవంతంగా పనిచేసిన వినోద్‌ కె. దాసరి... సీఈఓ, ఎమ్‌డీ పదవులకు  రాజీనామా చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఆయన రాజీనామా వచ్చే ఏడాది మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వ్యక్తిగత కారణాలతో పాటు, కొత్త విషయాలపై తనకున్న ఆసక్తిని మెరుగుపరచుకోవటానికి ఆయన రాజీనామా చేస్తున్నారని, ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించిందని కంపెనీ వివరించింది. తక్షణం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ధీరజ్‌ హిందుజా వ్యవహరిస్తారని పేర్కొంది. కొత్త సీఈఓ, ఎమ్‌డీ నియామకం కోసం నామినేషన్స్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ త్వరలోనే కసరత్తు ఆరం‍భించనున్నదని తెలిపింది. ఫలితాలు, వినోద్‌ దాసరి రాజీనామా మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. మంగళవారం బీఎస్‌ఈలో అశోక్‌ లేలాండ్‌ షేర్‌ 0.8 శాతం లాభంతో రూ.119 వద్ద ముగిసింది. 


 



You may be interested

యాపిల్ ఇండియా హెడ్‌గా ఆశిష్ చౌదరి

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ భారత విభాగానికి హెడ్‌గా ఆశిష్ చౌదరిని నియమించింది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం నోకియా నెట్‌వర్క్స్‌లో ఆయన చీఫ్ కస్టమర్‌ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. మరోవైపు, ఉన్నత స్థాయిలో మార్పులు, చేర్పులు చేపడుతున్నట్లు నోకియా వెల్లడించింది.

దేశీ స్టార్టప్‌లకు చైనీస్ దన్ను

Wednesday 14th November 2018

బీజింగ్‌: భారీగా నగదు నిల్వలున్న చైనా ఇన్వెస్టర్లు .. ప్రస్తుతం భారత స్టార్టప్‌ కంపెనీలకు దన్నుగా నిలుస్తున్నారు. గతేడాది ఏకంగా 2 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 12,900 కోట్లు) దేశీ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్ట్టార్టప్ ఇండియా అసోసియేషన్ (ఎస్‌ఐఏ), వెంచర్‌ గురుకుల్‌తో కలిసి భారతీయ ఎంబసీ బీజింగ్‌లో నిర్వహించిన సెమినార్‌లో కేపీఎంజీ ఈ

Most from this category