STOCKS

News


అశోక్‌ లేలాండ్‌ లాభం రూ.653 కోట్లు

Saturday 25th May 2019
news_main1558767326.png-25929

  • 12 శాతం డౌన్‌
  • ఒక్కో షేర్‌కు రూ.3.10 డివిడెండ్‌

న్యూఢిల్లీ: వాణిజ్య వాహన దిగ్గజం, అశోక్‌ లేలాండ్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.743 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.653 కోట్లకు తగ్గిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.8,652 కోట్ల నుంచి రూ.8,723 కోట్లకు పెరిగిందని అశోక్‌ లేలాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా తెలిపారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.10 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. 
ఏడాది లాభం 21 శాతం అప్‌...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.1,814 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం వృద్ధితో రూ.2,195 కోట్లకు పెరిగిందని ధీరజ్‌  వెల్లడించారు. మొత్తం ఆదాయం రూ.29,522 కోట్ల నుంచి రూ.32,753 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని,  వాహనాలకు సంబంధించి నిబంధనల్లో మార్పులు కఠినతరం అవుతున్నాయని, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్‌ వాటాను కోల్పోలేదని వివరించారు. ప్రస్తుత వృద్ధి జోరును కొనసాగించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. 



You may be interested

భారత్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Saturday 25th May 2019

బుల్లిష్‌ రికమండేషన్లు చేస్తున్న దిగ్గజాలు బీజేపీ ఘన విజయం పట్ల అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజ్‌లు హర్షం వ్యక్తం చేశాయి. కొత్త ప్రభుత్వం బ్యాంకుల, హౌఽసింగ్‌, రూరల్‌ ఎకానమీ, యుటిలిటీస్‌రంగాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టవచ్చని భావిస్తున్నాయి. స్వల్పకాలానికి వాల్యూషన్లు, ట్రేడ్‌వార్‌ ఈక్విటీ పరుగులకు రిస్కుగా మారవచ్చని అభిప్రాయపడుతున్నాయి. కానీ దీర్ఘకాలానికి భారత ఈక్విటీలు పరుగులు ఆగవని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ రికమండేషన్లు అందిస్తున్నాయి.  బ్రోకరేజ్‌లు సూచిస్తున్న షేర్లు... బ్రోకరేజ్‌ల

కొత్త సర్కారుకు.. సవాళ్ల స్వాగతం

Saturday 25th May 2019

ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి మందగమనానికి అడ్డుకట్ట వేయాలి బ్యాంకుల మొండి బాకీల కష్టాలు తీర్చాలి ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు ఉండాలి ఆర్థికవేత్తల అభిప్రాయం న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మందగమనానికి అడ్డుకట్ట వేయడం, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడం, మొండిబాకీల సమస్యల నుంచి బ్యాంకులను గట్టెక్కించడం మొదలైన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే

Most from this category