STOCKS

News


అశోక్‌లేలాండ్‌ ఎన్నోర్‌ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ

Saturday 8th September 2018
news_main1536380714.png-20074

చెన్నై: హిందుజా గ్రూపులో భాగమైన అశోక్‌లేలాండ్‌, తమిళనాడులోని ఎన్నోర్‌ ప్లాంట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సదుపాయాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఇక్కడ డిజైన్‌, ప్రొటోటైపింగ్‌, టెస్టింగ్‌, సొల్యూషన్స్‌ డిజైన్‌ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా కేంద్రాన్ని తీర్చిదిద్దింది. కంపెనీ 70వ వార్షికోత్సవం రోజే ఈ ప్రారంభోత్సవం జరగడం గమనార్హం. తేలికపాటి వాణిజ్య వాహనాలు, తక్కువ ఎత్తు ఉండే సిటీ బస్సులు తదితర ఎలక్ట్రిక్‌ వాహనాలను ఇక్కడ తయారు చేయాలన్నదే తమ ప్రణాళికగా కంపెనీ ఎండీ వినోద్‌ కే దాసరి తెలిపారు. 



You may be interested

వచ్చే నెల నుంచి సుజుకీ ఈవీ పరీక్షలు

Saturday 8th September 2018

2020లో తొలి ఎలక్ట్రిక్‌ వాహనం విడుదల భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విడుదలపై జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ తన ప్రణాళికలను ‘మూవ్‌’ సదస్సు సందర్భంగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు రహదారి పరీక్షలు నిర్వహించనున్నట్టు సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒసాము సుజుకి తెలిపారు. భద్రత, ఇక్కడి వాతావరణం, రద్దీ పరిస్థితులకు అనుగుణంగా సులభంగా వినియోగించుకునేలా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయడం కోసమే ఈ

8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ‘టెర్రా హెచ్‌పీ ఫాస్ట్‌ చార్జింగ్‌ సిస్టమ్‌’ను ఏబీబీ భారత మార్కెట్‌ కోసం ఆవిష్కరించింది. ఇందుకు ప్రపంచ రవాణా సదస్సు వేదికగా నిలిచింది. కేవలం 8 నిమిషాల చార్జింగ్‌తో ఓ కారు 200 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్‌ ఆధారితంగా మార్చే విషయంలో భారత ప్రభుత్వ ఆకాంక్షలు, చర్యల్ని ఏబీబీ సీఈవో ఉల్‌రిచ్‌ స్పీసోఫర్‌ ప్రశంసించారు. మూవ్‌ సదస్సులో పాల్గొన్న

Most from this category