STOCKS

News


ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా

Saturday 12th January 2019
Markets_main1547273398.png-23550

న్యూఢిల్లీ:  నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్‌ అశోక్‌ చావ్లా శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని న్యాయపరమైన పరిణామాల కారణంగా చావ్లా రాజీనామా చేశారని పేర్కొంది. మరే ఇతర వివరాలను ఎన్‌ఎస్‌ఈ వెల్లడించలేదు. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో అశోక్‌ చావ్లా, మరో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులపై చార్జీషీటు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందామని సీబీఐ న్యాయవాదుల బృందం ఢిల్లీలోని స్పెషల్‌ కోర్ట్‌కు విన్నవించింది. ఈ నేపథ్యంలో అశోక్‌ చావ్లా రాజీనామా చేశారు.You may be interested

ఈవారంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేసిన షేరు ఇదే..!

Saturday 12th January 2019

నిర్మాణ రంగంలో 99 ఏళ్లుగా సేవ‌లు అందిస్తున్న ఇండియన్‌ హ్యూమ్ పైప్‌(ఐహెచ్‌పీ) షేరును కొనవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్రోక‌రేజ్ సంస్థ సిఫార్సు చేస్తుంది. రంగం:- నిర్మాణ రంగం రేటింగ్‌:- బై టార్గెట్ ధ‌ర‌:- రూ.445లు విశ్లేషణ:- డ్రైనేజీ, ఇరిగేష‌న్‌, తాగునీటి స‌ర‌ఫ‌రా రంగంలో దేశంలోనే ప్రథ‌మస్థానంలో ఉంది. కంపెనీ 2018 ఆర్థిక సంవ‌త్సరం నాటికి రూ.1000 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. అక్టోబ‌ర్ 2018 నాటికి కంపెనీ రూ.3737 కోట్ల విలువైన బుక్ ఆర్డర్లను క‌లిగి ఉంది.

పారిశ్రామిక వృద్ధి అరశాతమే

Saturday 12th January 2019

- నవంబర్‌లో తీవ్ర నిరాశాకర ఫలితం - 17 నెలల కనిష్ట స్థాయి ఇది... - తయారీ, వినియోగంలో అసలు నమోదుకాని​వృద్ధి - భారీ యంత్రాల డిమాండ్‌ను సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌దీ ఇదే ధోరణి న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ నెలల్లో కేవలం 0.5 శాతంగా (2017 ఇదే నెలతో​ పోల్చి) నమోదయ్యింది. సూచీలోని తయారీ, వినియోగ రంగాల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ రేటు నమోదయ్యింది.

Most from this category