STOCKS

News


అరవింద్‌ లాభం రూ.67 కోట్లు

Saturday 18th May 2019
news_main1558153625.png-25816

  • ఒక్కో షేర్‌కు రూ.2 డివిడెండ్‌ 
  • ఎన్‌సీడీల ద్వారా రూ.300 కోట్లు సమీకరణ

న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అరవింద్‌ గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.115 కోట్ల నికర లాభం వచ్చిందని అరవింద్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,863 కోట్ల నుంచి రూ.1,879 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అరవింద్‌ కంపెనీ నుంచి బ్రాండెడ్‌ దుస్తుల వ్యాపార విభాగాన్ని అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ పేరుతో గత ఏడాది నవంబర్‌లో విడదీశామని (డీమెర్జ్‌), అందుకని అప్పటి, ఇప్పటి ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని కంపెనీ వివరించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 7-8 శాతం వృద్ధిచెందగలదన్న అంచనాలున్నాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్‌, గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా జయేశ్‌ కె. షాను నియమించామని, ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ల జారీ ద్వారా రూ.300 కోట్లు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.



You may be interested

యస్‌ బ్యాంక్ మాజీ బాస్ బోనస్ వెనక్కి

Saturday 18th May 2019

ఆర్‌బీఐ ఆదేశాలతో అసాధారణ నిర్ణయం రాణా కపూర్‌కి చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్ ఉపసంహరణ న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ తాజాగా అసాధార౾౾ణ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్‌కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్‌లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. బోనస్‌ కింద 2014-15లో రూ. 62.17 లక్షలు, 2015-16లో చెల్లించిన రూ. 82.45

భారతీ ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ సక్సెస్‌

Saturday 18th May 2019

అధికంగా సబ్‌స్క్రిప్షన్లు వచ్చినట్టు కంపెనీ ప్రకటన న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూకు మంచి స్పందన వచ్చింది. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు రూ.25,000 కోట్ల రైట్స్‌ ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయినట్టు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మే 3న ఆరంభమైన రైట్స్‌ ఇష్యూ శుక్రవారంతో ముగిసినట్టు పేర్కొంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, చెల్లింపులు పూర్తయిన తర్వాత కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఒక్కో

Most from this category