STOCKS

News


అరవింద్‌ ఆదాయం రూ.2,875 కోట్లు

Tuesday 7th August 2018
news_main1533618644.png-18995

న్యూఢిల్లీ: టెక్స్‌టైల్‌, దుస్తుల దిగ్గజ  కంపెనీ ఆరవింద్‌  ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.64 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.57 కోట్లుతో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని అరవింద్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.2,608 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.2,875 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున ఈ రెండు ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదని వివరించింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అరవింద్‌ షేర్‌ స్వల్పంగా నష్టపోయి రూ.420 వద్ద ముగిసింది. 


 



You may be interested

ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు జీతాల్లేవ్‌

Tuesday 7th August 2018

ముంబై: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మరోసారి ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు జీతాల చెల్లింపు ఆలస్యం చేసిన ఎయిర్‌ ఇండియా.. జూలై జీతాల చెల్లింపు ఇంకా చేయకపోగా, ఎప్పుడుచెల్లించేది స్పష్టత ఇవ్వలేదని వెల్లడయింది. వరుసగా మార్చి నుంచి పరిస్థితి ఇదే విధంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. 11,000 మంది శాశ్వత ఉద్యోగులను కలిగిన ఈ సంస్థ మార్చి

పవన్‌ హన్స్ వాటా విక్రయానికి ఓకే

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రీమియర్ హెలీకాప్టర్ క్యారియర్ సంస్థ పవన్‌ హన్స్‌లో ఓఎన్‌జీసీకి ఉన్నటువంటి 49 శాతం వాటా విక్రయానికి కంపెనీ బోర్డ్‌ అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి పవన్‌ హన్స్‌లో ఉన్న 51 శాతం వాటాతో కలిపి మొత్తం ఒకేసారి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ప్రైవేటు సంస్థకు అమ్మివేయడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు మార్గం సుగమమైంది. గడిచిన పది నెలల్లో పవన్‌ హన్స్‌లో కేంద్ర

Most from this category