STOCKS

News


బ్యాంకుల చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ

Tuesday 25th September 2018
news_main1537850659.png-20537

న్యూఢిల్లీ: వార్షిక ఆర్థిక పనితీరు సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో భేటీ కానున్నారు. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న చర్యల పురోగతితో పాటు పలు అంశాలు ఇందులో చర్చకు వస్తాయని  సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ వృద్ధి, బాకీల రికవరీకి తీసుకుంటున్న చర్యలు, చట్టపరంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు మొదలైనవి కూడా చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి. మొండిబాకీలను రాబట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బ్యాంకులు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటికే రూ. 36,551 కోట్లు రాబట్టాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైన మొండిబాకీలతో పోలిస్తే ఇది 49 శాతం అధికం. మూడు పీఎస్‌బీలను (బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్‌) విలీనం చేయాలంటూ ప్రత్యామ్నాయ యంత్రాంగం సిఫార్సు చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017-18లో పీఎస్‌బీల నష్టాలు రూ. 87,357 కోట్ల పైచిలుకు నమోదయ్యాయి. 21 పీఎస్‌బీల్లో రెండు మాత్రమే (ఇండియన్ బ్యాంక్‌, విజయా బ్యాంక్‌) లాభాలు ప్రకటించాయి.
ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ కోసం చర్యలు: జైట్లీ
నిధుల కష్టాల వార్తలతో ఆర్థిక సంస్థల షేర్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), మ్యూచువల్ ఫండ్స్‌కి తగింత లిక్విడిటీ ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కావడానికి ముందు..  మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్ చేశారు. రుణాలు బాకీ పడిన ఐఎల్‌ అ౾ండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌తో పాటు లిక్విడిటీ సమస్యల వార్తలతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు కుప్పకూలడం.. వాటితో పాటు మార్కెట్లు పతనం అవుతుండటం తెలిసిందే. ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నాల్లో భాగంగా.. ఆర్థిక రంగంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామంటూ రిజర్వ్ బ్యాంక్‌, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించాయి. 



You may be interested

ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ నుంచి రూ.5,000 కోట్ల రీట్‌

Tuesday 25th September 2018

న్యూఢిల్లీ: రీట్‌ (రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) ద్వారా రూ.5,000 కోట్ల సమీకరణకు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు కంపెనీలు కలసి ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ పేరుతో ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీ రీట్‌ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ఆఫర్‌ డాక్యుమెంట్‌ను ఈ జేవీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

ఆల్‌టైమ్‌ కనిష్టానికి సమీపంలో రూపీ

Tuesday 25th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం జీవిత కాల కనిష్ట స్థాయికి సమీపంలో ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన సోమవారం ముగింపు 72.63తో పోలిస్తే 0.44 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 72.96 వద్ద ప్రారంభమైంది.  క్రూడ్‌ ధరల పెరుగుదల

Most from this category