STOCKS

News


25న బ్యాంక్‌ చీఫ్‌లతో అరుణ్ జైట్లీ భేటీ..!

Wednesday 19th September 2018
news_main1537340071.png-20380

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సెప్టెంబర్‌ 25వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశం కానున్నారు. వార్షిక ఫైనాన్షియల్‌ పరిస్థితులపై ఆయన ఈ సందర్భంగా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా  ఈ సమావేశంలో బ్యాంకింగ్‌ మొండిబకాయిలపై చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంకుల విలీన నిర్ణయమూ కీలక సమావేశానికి నేపథ్యం. రుణ వృద్ధి, బకాయిల రికవరీకి బ్యాంకింగ్‌ తీసుకుంటున్న చర్యలు వంటి అంశాలు సమావేశ అజెండాలో ఉంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.



You may be interested

20 నెలల తర్వాత 200 డీఎంఏ దిగువకు

Wednesday 19th September 2018

దిగజారిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు వచ్చింది. గత 20 నెలల్లో బ్యాంకు షేరు బలమైన 200 రోజుల డీఎంఏ స్థాయి దిగువకు రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్యాంకు షేరు దాదాపు ఒక శాతం నష్టంతో రూ. 1975 వద్ద కదలాడుతోంది. చార్టుల్లో ఎంఏసీడీ ఇండికేటర్‌ లైన్‌సైతం తన సిగ్నల్‌ లైన్‌కు దిగువన కదలాడుతోంది. దీన్ని బట్టి

ఈ బ్యాంకుల గవర్నెన్స్‌ మెరుగుపడుతుంది.

Wednesday 19th September 2018

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదన ఆయా బ్యాంకులకు సానుకూల అంశమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. దీనితో వాటి గవర్నెన్స్‌, సమర్ధత మెరుగుపడగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గ్రూప్) అల్కా అన్బరసు తెలిపారు. విలీన బ్యాంక్‌కు రుణాలపరంగా 6.8 శాతం మార్కెట్ వాటా ఉంటుందని, తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో మూడో అతి పెద్ద బ్యాంక్‌గా మారగలదని వివరించారు.

Most from this category