STOCKS

News


ఆర్థిక విధానాలపై అర్థవంతమైన చర్చ అవసరం: జైట్లీ

Saturday 17th November 2018
news_main1542433166.png-22132

ముంబై: నినాదాలు, ప్రజాకర్షణలు ఆర్థిక విధానాలను నడిపించలేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఆర్థిక విధానాలపై వాస్తవాలు, పూర్తి సమాచారం ఆధారంగా తగిన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మనీకంట్రోల్‌ సంస్థ నిర్వహించిన వెల్త్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. దేశంలో నాణ్యమైన చర్చలు కొరవడ్డాయన్న ఆయన, ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరిగేలా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరగాలన్నారు. కేవలం ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నామని, దీనికి బదులు ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. 



You may be interested

విదేశీ దిగుమతుల తగ్గింపే లక్ష్యం

Saturday 17th November 2018

సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు విదేశాల నుంచి ఆయిల్‌ దిగుమతిని 10 శాతం తగ్గించటమే లక్ష్యంగా ఓఎన్‌జీసీ పని చేస్తోందని దాని అనుబంధ విభాగం ఓఎన్‌జీసీ విదేశ్‌ డైరెక్టర్‌ పి.కె.రావు చెప్పారు. విదేశాల్లో సంస్థ కార్యకలాపాలు విజయవంతంగా సాగిస్తున్నట్లు చెప్పారాయన. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అసెట్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2002 నుంచి ఓఎన్‌జీసీ వివిధ దేశాల కంపెనీలతో కలసి సంయుక్తంగా కార్యకలాపాలు

యస్‌ బ్యాంక్‌ చీఫ్‌ రేసులో 10 మంది బ్యాంకర్లు..

Saturday 17th November 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ కొత్త సీఈవో పదవి రేసులో దాదాపు 5-10 మంది బ్యాంకర్లున్నట్లు తెలుస్తోంది. సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన సెర్చి కమిటీ షార్ట్‌ లిస్ట్ చేసిన వారిలో ఒక విదేశీ బ్యాంక్‌ (ఎంఎన్‌సీ) చీఫ్‌తో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అధిపతి, మరికొన్ని ప్రైవేట్ బ్యాంకుల హెడ్స్  ఉన్నట్లు సమాచారం. లిస్టులో 5-10 మంది బ్యాంకర్ల పేర్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే

Most from this category