STOCKS

News


ఉక్కు ప్లాంట్ల విక్రయానికి ఆర్సెలర్‌ మిట్టల్ డీల్‌

Saturday 13th October 2018
news_main1539408830.png-21105

న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్‌ తాజాగా యూరప్‌లోని తమ స్టీల్‌ ప్లాంట్లలో నాలుగింటిని లిబర్టీ హౌస్‌కు విక్రయించడానికి సిద్ధమయింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇల్వా ఎస్‌పీఏ కొనుగోలుకు సంబంధించి యూరోపియన్ కమిషన్‌ (ఈయూ) విధించిన షరతులకు అనుగుణంగా ఈ నాలుగింటినీ ఆర్సెలర్‌ మిట్టల్ విక్రయిస్తోంది. ఒస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌) గలాటి (రొమేనియా), స్కోప్యే (మెసిడోనియా), ప్యాంబినో (ఇటలీ) ప్లాంట్ల కొనుగోలు కోసం లిబర్టీ హౌస్ గ్రూప్ ఆఫర్‌ ఇచ్చినట్లు ఆర్సెలర్‌ మిట్టల్ తెలిపింది. లగ్జెంబర్గ్‌లోని డూడ్‌లాంజ్‌, బెల్జియంలోని లీజ్‌తో పాటు ఇతరత్రా పలు ప్లాంట్లను కూడా విక్రయించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.



You may be interested

ప్రభుత్వానికి రూ.6 లక్షల కోట్ల నష్టం

Saturday 13th October 2018

ముంబై: స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటు కేంద్ర ప్రభుత్వానికీ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తాజా పతనంలో ప్రభుత్వరంగ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గణనీయంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నష్టం రూ.6 లక్షల కోట్లకు పైమాటే. గణాంకాలను గమనిస్తే... 41 ప్రభుత్వరంగ కంపెనీల (పీఎస్‌యూలు) మార్కెట్‌ విలువ వాటి 52 వారాల గరిష్ట ధర నుంచి చూస్తే సగానికి పడిపోయింది. మరో 32 పీఎస్‌యూల మార్కెట్‌ విలువ 12- 44 శాతం మధ్యలో

నాలుగైదేళ్లలో శ్రీనివాస ఫార్మ్స్‌ ఐపీవో

Saturday 13th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే నాలుగైదేళ్లలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కి (ఐపీవో) రావాలని శ్రీనివాస ఫార్మ్స్ యోచిస్తోంది. ప్రస్తుతం రూ. 750 కోట్లుగా ఉన్న టర్నోవర్‌ అప్పటికి రూ. 2,000 కోట్లకు చేరగలదని సంస్థ ఎండీ సురేష్‌ చిట్టూరి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ‘వరల్డ్‌ ఎగ్‌ డే’ సందర్భంగా శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తాజాగా ఇంటర్నేషనల్‌

Most from this category