STOCKS

News


రూ. 7,500 కోట్లు చెల్లిస్తాం

Thursday 18th October 2018
news_main1539834754.png-21262

న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్‌ కొనుగోలు బిడ్డింగ్‌కు అర్హత పొందే దిశగా సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రుణదాతలకు చెల్లించాల్సిన రూ.7,469 కోట్లు చెల్లించేందుకు సిద్ధమని ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్ తెలిపింది. భారత మార్కెట్లో స్థానం దక్కించుకునేందుకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు మంచి అవకాశం కాగలదని పేర్కొంది. ఎస్సార్‌ స్టీల్ కొనుగోలు కోసం ఆర్సెలర్‌మిట్టల్‌, న్యూమెటల్ సంస్థలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొండిపద్దులుగా మారిన ఉత్తమ్‌ గాల్వా, కేఎస్‌ఎస్ ‍పెట్రాన్‌ సంస్థల్లో ఆర్సెలర్‌మిట్టల్‌కు వాటాలు ఉండేవి. బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకునే సంస్థలు.. తమకు భాగస్వామ్యం ఉన్న ఇతర సంస్థల మొండిబాకీలను రెండు వారాల్లోగా తీర్చేయాల్సి ఉంటుందని ఆక్టోబర్ 4న సుప్రీం కోర్టు ఆదేశించింది. బిడ్డింగ్ అర్హతలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ రెండు సంస్థల మొండిబాకీలు తీరుస్తామంటూ ఆర్సెలర్‌మిట్టల్ తాజాగా వెల్లడించింది. ప్రతిపాదిత రూ. 7,469 కోట్లలో సుమారు 80 శాతం వాటా ఉత్తమ్ గాల్వా బాకీలు తీర్చేందుకు, మిగతాది కేఎస్‌ఎస్ పెట్రాన్ బకాయిలను తీర్చేందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. You may be interested

డీసీబీ బ్యాంక్‌ లాభం రూ.73 కోట్లు

Thursday 18th October 2018

ముం‍బై: ప్రైవేట్‌ రంగంలోని డీసీబీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.73 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.59 కోట్ల నికర లాభం వచ్చిందని, 25 శాతం వృద్ధిని సాధించామని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ2లో రూ.652 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.809 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మురళీ ఎమ్‌. నటరాజన్‌

లాభాల్లో రిలయన్స్‌ కొత్త రికార్డు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)... ఈ ఆర్థిక సంవత్సరం జూలై- సెప్టెంబర్‌ త్రైమాసిక లాభంలో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.8,109 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం 0.6 శాతమే పెరిగినట్టు లెక్క. విశ్లేషకులు

Most from this category