STOCKS

News


ఎస్సార్‌ స్టీల్ కొనుగోలుకు  ఆర్సెలర్‌ మిట్టల్ తాజా బిడ్‌

Tuesday 11th September 2018
news_main1536642665.png-20158

న్యూఢిల్లీ: భారీ రుణాల్లో కూరుకుపోయిన ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ సోమవారం ఉదయం తాజా బిడ్‌ దాఖలు చేసింది. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటోమో మెటల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో ఈ బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. బిడ్‌ విలువ ఎంతన్నది అధికారికంగా తెలియనప్పటికీ, ఈ మొత్తం రూ.42,000 కోట్లు ఉండవచ్చని వినిపిస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ రుణ దాతలకు తిరిగి చెల్లింపులు చేయటానికి ఆర్సెలర్‌ మిట్టల్‌ ఈ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఎస్‌ఐఎల్‌) క్రెడిటార్స్‌ కమిటీకి ఈ మేరకు సవరించిన బిడ్‌ను సమర్పించినట్లు ఆర్సెలర్‌ మిట్టల్‌ తెలియజేసింది. గత అనుబంధ సంస్థలు... ఉత్తమ్ గాల్వా, కేఎస్‌ఎస్ పెట్రోన్‌ల రూ.7,000 కోట్ల బకాయిల చెల్లింపులకు కూడా తాజా ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్‌ ఆఫర్‌ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. సంబంధిత రూ. 7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్‌ 11లోగా చెల్లించేస్తే ఆర్సెలర్‌ మిట్టల్ ఇండియా బిడ్‌కు  పరిశీలనార్హత ఉంటుందని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  
రుణ బకాయిలు రూ.49,000 కోట్లు...
సుమారు రూ. 49,000 కోట్ల మొండిబాకీలను రాబట్టుకునేందుకు ఎస్సార్‌ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. తొలి రౌండులో రష్యా సంస్థ న్యూమెటల్‌, ఆర్సెలర్‌మిట్టల్‌ బిడ్లు వేసినప్పటికీ.. డిఫాల్ట్ అయిన సంస్థలతో వాటి ప్రమోటర్లకు లావాదేవీలున్నాయన్న కారణంతో సీవోసీ సదరు బిడ్లను తిరస్కరించింది. న్యూమెటల్‌లో ఎస్సార్‌ స్టీల్ ప్రమోటరు రవి రుయా కుమారుడు రేవంత్ రుయాకు  వాటాలున్నాయన్న కారణంతో ఆ సంస్థ బిడ్‌ను తిరస్కరించింది. అటు, బ్యాంకులకు బాకీ పడ్డ ఉత్తమ్ గాల్వా, కేఎస్‌ఎస్ పెట్రోన్‌లలో వాటాలు ఉన్నందున ఆర్సెలర్‌ మిట్టల్ బిడ్ తిరస్కరణకు గురైంది. దీంతో సీవోసీ రెండో విడత బిడ్లను ఆహ్వానించింది. రేవంత్‌ రుయా వాటాల ఉపసంహరణ నేపథ్యంలో  ఇప్పటికే న్యూ మెటల్‌ తన తాజా బిడ్‌ను దాఖలు చేసింది. ఈ విలువ రూ.37,000 కోట్లేనని సమాచారం. ఇక ఉత్తమ్ గాల్వా, కేఎస్‌ఎస్ పెట్రోన్‌ల రూ.7,000 కోట్ల బకాయిల చెల్లింపుల ప్రతిపాదనతో ఆర్సెలర్‌ మిట్టల్‌ తాజా బిడ్‌ వేసింది. రెండు సంస్థలతో పాటు వేదాంతా కూడా మూడవ బిడ్డర్‌గా ఉంది.



You may be interested

రూపాయి కోసం ఆర్‌బీఐతో కేంద్రం సంప్రదింపులు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి అదే పనిగా పడిపోతుండడంతో కేంద్రం తన వంతు ప్రయత్నాలు ఆరంభించింది. ఆర్‌బీఐ జోక్యం ద్వారా రూపాయి క్షీణతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. కేంద్రం సూచనల ఫలితమేమో కానీ, ఆర్‌బీఐ ఇప్పటికే రంగంలోకి దిగి డాలర్ల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో విదేశీ మారకం నిల్వలు ఆగస్ట్‌ చివరికి 400.10 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్టు ఆర్‌బీఐ నివేదిక

రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌లో వాటా కోసం దిగ్గజ సంస్థల పోటీ

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌లో వాటా కొనుగోలు కోసం దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయని సమాచారం.  రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ 24.99 శాతం వాటాను విక్రయానికి పెట్టింది. ఈ వాటా కొనుగోలు కోసం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, సింగపూర్‌ సావరిన్‌ ఫండ్‌ జీఐసీ, పబ్లిక్‌ సెక్టర్‌ పెన్షన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ కెనడాలు రేసులో ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Most from this category