STOCKS

News


ఆర్సెలర్‌ మిట్టల్‌, న్యుమెటల్‌కు మరో అవకాశం

Friday 5th October 2018
news_main1538714094.png-20881

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు బిడ్‌ వేసుకునేందుకు ఆర్సెలర్‌ మిట్టల్‌, రష్యాకు చెందిన వీటీబీ బ్యాంకు ఆధ్వర్యంలోని న్యుమెటల్‌కు సుప్రీంకోర్టు మరో అవకాశం కల్పించింది. రూ.45,000 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైన ఎస్సార్‌ స్టీల్‌ పునరుద్ధరణ ప్రణాళికను దాఖలు చేసేందుకు మాత్రం అనుమతి లేదని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రెండు వారాల్లోగా మీ కంపెనీల తాలూకు ఎన్‌పీఏలను చెల్లించేయండి. అలా చెల్లించినట్టయితే, మీరు పరిష్కార ప్రణాళికలను సమర్పించొచ్చు’’ అని కోర్టు పేర్కొంది. ఏ ప్రణాళిక కూడా ఆమోదనీయంగా లేదని రుణదాతల కమిటీ భావిస్తే, ఎస్సార్‌ స్టీల్‌ లిక్విడేషన్‌కు వెళుతుందని (ఆస్తుల అమ్మకం) స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం... ఉత్తమ్‌గాల్వా, కేఎస్‌ఎస్‌ పెట్రాన్‌ సంస్థల రుణ బకాయిలను ఆర్సెలర్‌ మిట్టల్‌ సంస్థ తీర్చివేస్తేనే.... ఎస్సార్‌ స్టీల్‌కు బిడ్‌ వేసేందుకు అర్హత లభిస్తుంది. మరో సంస్థ న్యుమెటల్‌కు సంబంధించిన కార్పొరేట్‌ రుణ బకాయిలను ఏవీ పేర్కొనలేదు. 



You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్ పరిరక్షణకు చర్యలు..

Friday 5th October 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ విలువను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బోర్డు పేర్కొంది. వ్యవస్థాగతంగా కీలకమైన సంస్థను గట్టెక్కించే ప్రణాళిక రూపకల్పన కోసం తరచూ భేటీ కానున్నట్లు తెలిపింది. గురువారం తొలిసారిగా భేటీ అయిన కొత్త బోర్డు దాదాపు అయిదు గంటల పాటు కంపెనీ వ్యవహారాలపై చర్చించింది. గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇతర వాటాదారులతో కూడా తగు సమయంలో భేటీ

15 రోజుల్లోపు ఎయిర్‌ ఇండియా పునరుద్ధరణ ప్యాకేజీ: చౌబే

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ఎయిర్‌ఇండియా పునరుద్ధరణ ప్యాకేజీని 10-15 రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే తెలిపారు. రూ.50,000 కోట్లకు పైగా రుణ భారంతో, తీవ్ర నష్టాల మధ్య నడుస్తున్న ఎయిర్‌ఇండియాలో వాటాలను అమ్మేయాలని ప్రభుత్వం లోగడ ప్రయత్నించినప్పటికీ కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ సంస్థను ఒడ్డున పడేసే బాధ్యత ప్రభుత్వంపైనే పడింది. అధిక చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత

Most from this category