STOCKS

News


ఆపిల్ కార్డ్.. డిజిటల్‌ చెల్లింపులకు నయా ఫ్రెండ్‌

Wednesday 27th March 2019
Markets_main1553665147.png-24819

ఆపిల్ కార్డ్.. డిజిటల్‌ చెల్లింపులకు నయా ఫ్రెండ్‌
- ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు

శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా క్రెడిట్‌ కార్డ్‌ సేవల్లోకి అడుగుపెట్టింది. ‘ఆపిల్ కార్డ్’ పేరుతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టింది. తన సొంత వాలెట్‌ యాప్‌ ఆధారంగా సునాయాసంగా డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వీలుకల్పిస్తోంది. కార్డు నెంబర్‌, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్‌ వంటి సంప్రదాయ ఫిజికల్‌ క్రెడిట్‌ కార్డ్‌ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే అధునాతన డిజిటల్‌ కార్డును ఐఫోన్‌ వినియోగదారులకు అందిస్తోంది. ఎక్స్‌పైరీ డేట్‌ లేని ఈ కార్డు సహాయంతో అత్యంత సులువుగా షాపింగ్ పూర్తిచేయవచ్చని ఆపిల్‌ ప్రకటించింది. ‘ఆపిల్ పే’ యాప్‌లో అభివృద్ధిచేసిన డిజిటల్‌ క్రెడిట్‌ కార్డు వినియోగంపై 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ అందుతుంది. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్‌ సేవలను గోల్డ్‌మన్‌ శాక్స్‌ అందిస్తుండగా.. అంతర్జాతీయ చెల్లింపుల నెట్‌వర్క్‌ను మాస్టర్‌కార్డ్‌ అందిస్తోంది. ‘ఐఫోన్‌లోని ఆపిల్ పే యాప్‌లో సైన్‌ఇన్‌ అయిన క్షణాల్లోనే ఈ క్రెడిట్‌ కార్డ్‌ సేవలను పొందవచ్చు. మెషిన్‌ లెర్నింగ్‌, ఆపిల్ మ్యాప్స్ ఆధారంగా చెల్లింపు జరిగిన స్థలం, మర్చెంట్‌ పేరు స్టోర్‌ అయి ఉంటాయి. కస్టమర్ల డేటాను ఇతరులకు విక్రయించేది లేదని గోల్డ్‌మన్‌ శాక్స్‌ స్పష్టంచేసింది. ఇందువల్ల కార్డు భద్రత విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదఅని ఆపిల్ పే వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ బైలీ పేర్కొన్నారు. ఈ వేసవి నుంచి అమెరికాలో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

ఆపిల్ ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ వార్తల సమాహారం
అరచేతిలో ప్రపంచాన్ని ఉంచే విస్తృత సేవల్లో భాగంగా ఆపిల్‌ మరో అడుగు ముందుకువేసింది. మ్యూజిక్ సేవల్లో సంచలనం సృష్టించిన ఈ సంస్థ.. నెట్‌ఫ్లిక్స్ సహాయంతో ఇక నుంచి తాజా వార్తలను సైతం అందించే ప్రయత్నంచేస్తోంది. ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్‌ న్యూస్‌’ పేరుతో 300 పైగా మేగజైన్లలోని ఆర్టికల్స్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు సమగ్ర వార్తలను అందిస్తోంది. నెలకు 10 డాలర్లను సబ్‌స్క్రిప్షన్‌ కింద చెల్లించడం ద్వారా ఆపిల్‌ కస్టమర్లు ఈ సేవలు అందుకోవచ్చని వెల్లడించింది.



You may be interested

కింగ్‌ఫిషర్‌ను కూల్చేశారు... జెట్‌ను గట్టెక్కిస్తున్నారు

Wednesday 27th March 2019

బ్యాంకుల ద్వంద ప్రమాణాలపై మాల్యా మండిపాటు న్యూఢిల్లీ: మాజీ లిక్కర్‌ కింగ్‌, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా బ్యాంకుల ద్వంద ప్రమాణాలపై మండిపడ్డారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్దాక్షిణ్యంగా విఫలమయ్యేందుకు కారణమైన బ్యాంకులు... ఇప్పుడు అదే విధమైన పరిస్థితిలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను మాత్రం ఒడ్డెక్కిస్తున్నాయని ఎత్తిచూపారు. సమస్యల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ తన నియంత్రణలోకి తీసుకోవడంపై వరుస ట్వీట్లతో మాల్యా తన స్పందన తెలియజేశారు. కింగ్‌ఫిషర్‌ విషయంలోనూ

ఇంటింటికీ... ఆన్‌లైన్‌ వంట

Wednesday 27th March 2019

ఇంటింటికీ... ఆన్‌లైన్‌ వంట జొమాటో, స్విగ్గీల భారీ విస్తరణ ప్రతీ రోజూ కొత్తగా ఓ పట్టణంలోకి చిన్న పట్టణాల్లోనూ వీటికి ఆదరణ వేల సంఖ్యలో నిత్యం ఆర్డర్లు పెరుగుతున్న ఆర్జించే మహిళలు దీనికితోడు ఆకర్షిస్తున్న ఆఫర్లు న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ వంటకు భారతీయులు అలవాటుపడుతున్నారు. నచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో, మొబైల్‌ యాప్స్‌ నుంచి సులభంగా ఆర్డర్‌ చేసి, తామున్న చోటుకు తెప్పించుకుని తినేస్తున్నారు. పెద్ద పట్టణాల్లోనే కాదు, చిన్న పట్టణాలకూ ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇంటి వంటకే ప్రాధాన్యం

Most from this category