News


యాపిల్‌ సీఈవో వేతనం @ రూ.110 కోట్లు

Thursday 10th January 2019
news_main1547098079.png-23497

వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం యాపిల్ అమ్మకాలు భారీగా పెరిగిన నేపథ్యంలో సంస్థ సీఈవో టిమ్ కుక్ జీతభత్యాలు గతేడాది ఏకంగా 22 శాతం పెరిగాయి. 2018లో ఆయన ఏకంగా 15.7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 110 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. ఇందులో 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 21 కోట్లు) మూల వేతనం కాగా, 12 మిలియన్ డాలర్ల (దాదాపు 84 కోట్లు) బోనస్‌, 6,80,000 డాలర్లు ఇతరత్రా భత్యాల కింద చెల్లించినట్లు యాపిల్ పేర్కొంది. 2018లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా టిమ్‌ జీతభత్యాలు పెంచినట్లు సంస్థ వివరించింది. 2018లో మొత్తం అమ్మకాలు 16 శాతం పెరిగి 265.6 బిలియన్ డాలర్లకు చేరగా, నిర్వహణ లాభాలు కూడా అంతే వృద్ధితో 70.9 బిలియన్ డాలర్లకు చేరినట్లు యాపిల్ తెలిపింది. 2011లో యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్‌.. 2016లో 8.7 మిలియన్ డాలర్లు, 2017లో 12.8 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు.



You may be interested

ఎలక్ట్రిక్‌ వాహనం కొంటే... పార్కింగ్‌ ఉచితం

Thursday 10th January 2019

రోడ్‌ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా తక్కువే ప్రభుత్వానికి ప్యానెల్‌ సిఫారసులు న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ముందుకొచ్చే వారికి ఎన్నో ప్రోత్సాహకాలు, రాయితీలు లభించనున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ సిన్హా ఆధ్వర్యంలోని ప్యానెల్‌ పలు కీలక సిఫారసులు చేసింది. తయారీదారులు కూడా పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలన్నది ప్రతిపాదన. ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తక్కువ ఉండేలా చూడాలని,

మొబైల్ వాలెట్లకు మార్చి గండం

Thursday 10th January 2019

కేవైసీ ధృవీకరణకు ఫిబ్రవరి డెడ్‌లైన్‌ గడువులోగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువే ఆధార్‌పై చెల్లుబాటుపై సుప్రీం తీర్పుతో మరిన్ని దీంతో 95 శాతం వాలెట్లు మూతబడే పరిస్థితి న్యూఢిల్లీ: డిజిటల్‌ విప్లవంతో కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన మొబైల్‌ వాలెట్‌ సంస్థలకు ప్రస్తుతం కేవైసీ నిబంధనలు సంకటంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి కస్టమర్లందరి వివరాల (కేవైసీ) ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలను అమలు చేయడానికి వాలెట్‌ సంస్థలు పరుగులు

Most from this category