News


యాపిల్ ఇండియా హెడ్‌గా ఆశిష్ చౌదరి

Wednesday 14th November 2018
news_main1542173647.png-21980

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తమ భారత విభాగానికి హెడ్‌గా ఆశిష్ చౌదరిని నియమించింది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం నోకియా నెట్‌వర్క్స్‌లో ఆయన చీఫ్ కస్టమర్‌ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. మరోవైపు, ఉన్నత స్థాయిలో మార్పులు, చేర్పులు చేపడుతున్నట్లు నోకియా వెల్లడించింది. దాదాపు 15 సంవత్సరాల పాటు కీలక హోదాల్లో పనిచేసిన ఆశిష్ చౌదరి ఈ ఏడాది ఆఖరునాటికి తప్పుకోనున్నట్లు, మరో సంస్థలో లీడర్‌షిప్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది. ఎంటర్‌ప్రైజ్‌, టెలికం రంగాల్లో చౌదరికి అంతర్జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. 



You may be interested

సన్‌ఫార్మాకు రూ.219 కోట్ల నష్టం

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఊహించని విధంగా ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.219 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టాలను ప్రకటించింది. అమెరికాలో మోడఫినిల్‌ యాంటీ ట్రస్ట్‌ కేసు పరిష్కారం కోసం రూ.1,214 కోట్లను కేటాయించడంతో లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ కేసులో ప్రత్యర్థి పార్టీలకు చెల్లించాల్సిన మొత్తాన్ని అంచనా వేసి ఈ మేరకు పక్కన పెట్టినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ కేసులో కొన్ని పార్టీలతో ఇప్పటికే సన్‌ఫార్మా ఒప్పందం కూడా చేసుకుంది. విశ్లేషకులు

అశోక్‌ లేలాండ్‌ ఆదాయం 25 శాతం అప్‌

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 37 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.334 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.460 కోట్లకు పెరిగిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.6,076 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.7,608 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ వినోద్‌ కె. దాసరి

Most from this category