అపోలో టైర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్
By Sakshi

న్యూఢిల్లీ: అపోలో టైర్స్ కంపెనీకి ఐదేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు అపోలో టైర్స్ కంపెనీ సచిన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక సెలబ్రిటిని బ్రాండ్ అంబాసిడర్‌గా కుదుర్చుకోవడం ఇదే మొదటిసారని అపోలో టైర్స్ తెలిపింది. సచిన్ టెండూల్కర్‌తో అనుబంధం తమకు ప్రయోజనం కలిగిస్తుందని కంఎనీ వైస్ చైర్మన్, ఎమ్డీ నీరజ్ కన్వర్ పేర్కొన్నారు. భారత్‌లో ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నియన్ ఎఫ్సీకి ప్రధాన స్పాన్సరర్‌గా, మినర్వా పంజాబ్ ఎఫ్సీకి టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నామని తెలిపారు.
You may be interested
రవాణా వ్యయాలు తగ్గింపుపై దృష్టి: ప్రభు
Friday 23rd November 2018న్యూఢిల్లీ: సరుకులు వేగంగా రవాణా అయ్యేందుకు, రవాణా లావాదేవీల వ్యయాలను తగ్గించేందుకు నూతన సమగ్ర రవాణా విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రైలు, రోడ్డు, నౌక, వాయు రవాణా వ్యవస్థలను అనుసంధానించే విధంగా ఈ విధానం ఉంటుందన్నారు. రవాణాను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఓ పోర్టల్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టు ఢిల్లీలో జరిగిన సిల్ట్ ఎక్స్పో 2019 సందర్భంగా మంత్రి ప్రకటించారు. దేశంలో సరుకుల రవాణా
భారత్‌లో పెట్టుబడులు పెంచండి
Friday 23rd November 2018మెల్బోర్న్: భారత్‌లో పెట్టుబడులు పెంచాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. భారత్‌లో ఆస్ట్రేలియా పెట్టుబడులు కనిపించేంత లేవని, ఈ అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. పెట్టుబడులపై గణనీయమైన రాబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సమక్షంలో మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ పారిశ్రామిక సమూహాన్ని ఉద్దేశించి భారత రాష్ట్రపతి మాట్లాడారు. రెండు దేశాలూ పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఆర్థికం, రవాణా, పారిశ్రామిక