STOCKS

News


అపోలో మ్యూనిక్‌లో ప్రమోటర్ల వాటా విక్రయం..

Thursday 14th February 2019
Markets_main1550123557.png-24187

  • 41 శాతం వాటాలకు రూ.1,200 కోట్లకు డీల్‌?
  • నాలుగు సంస్థలతో చర్చలు
  • ఆరు నెలల్లోగా డీల్ పూర్తయ్యే అవకాశాలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణభారం తగ్గించుకునే దిశగా ఆరోగ్య బీమా సేవలందించే జాయింట్ వెంచర్ సంస్థ అపోలో మ్యూనిక్ హెల్త్‌లో వాటాలను విక్రయించడంపై అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్స్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 41 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని సుమారు రూ. 1,200 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నాలుగు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని, వీటిలో రెండు ఈక్విటీ ఫండ్ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో వాటాల విక్రయం పూర్తి కావొచ్చని అంచనా. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ రుణభారం సుమారు రూ. 3,430 కోట్లుగా ఉంది. సంస్థలో ప్రమోటర్స్‌కు 34 శాతం వాటాలు ఉండగా గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఇందులో దాదాపు 74 శాతం వాటాలు తనఖాలో ఉన్నట్లు తెలుస్తోంది. రుణభారాన్ని తగ్గించుకునేందుకు అపోలో ప్రమోటర్స్‌ ఈ నిధులను వినియోగించారు.  రుణాలు తీర్చేందుకు తనఖా ఉంచిన షేర్ల పరిమాణం ఈ మధ్య కాలంలో కొంత పెరిగిందన్న అపోలో ఎండీ సునీతా రెడ్డి .. వచ్చే ఆరు నెలల వ్యవధిలో దాన్ని 50 శాతానికి తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇటీవల తెలిపారు. అయితే, బీమా వెంచర్‌లో వాటాల విక్రయ వార్తలపై మాత్రం స్పందించలేదు. 

గతంలోనే కొంత వాటా విక్రయం..
2007లో ప్రారంభమైన అపోలో మ్యూనిక్‌ సంస్థ ఆరోగ్య, ప్రమాద బీమా, ప్రయాణ బీమా పథకాలను ఈ సంస్థ అందిస్తోంది. జర్మనీకి చెందిన మ్యూనిక్ ఆర్‌ఈ గ్రూప్‌లో భాగమైన డీకేవీ ఏజీతో కలిసి దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రారంభంలో సంస్థ పేరు అపోలో డీకేవీగా ఉండేది. ఆ తర్వాత 2009లో అపోలో డీకేవీ పేరును అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌గా మార్చారు. దీన్ని ప్రారంభించినప్పుడు అపోలో హాస్పిటల్, డీకేవీ ఏజీ వాటాలు 74:26 నిష్పత్తిలో ఉండేవి. ఆ తర్వాత 2016 జనవరిలో మ్యూనిక్‌ ఆర్‌ఈ.. అపోలో మ్యూనిక్‌లో 23.27 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీంతో సంస్థలో మ్యూనిక్‌ ఆర్‌ఈ వాటా 48.75 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌ నాటికి భారత్‌లో అపోలో మ్యూనిక్‌కు 180 కార్యాలయాలు, 3,200 మంది ఉద్యోగులున్నారు. గతడాది మార్చి ఆఖరు నాటికి అపోలో మ్యూనిక్ సంస్థ స్థూల ప్రీమియం వసూళ్లు రూ. 1,720 కోట్లుగా ఉన్నాయి.



You may be interested

స్కెచర్స్‌ చేతికి ఫ్యూచర్స్‌ 49 శాతం వాటా

Thursday 14th February 2019

డీల్‌ విలువ రూ.600 కోట్లు ! న్యూఢిల్లీ: స్కెచర్స్‌ ఇండియా జాయింట్‌ వెంచర్‌లో ఫ్యూచర్స్‌ గ్రూప్‌నకు ఉన్న 49 శాతం వాటాను మాతృ కంపెనీ స్కెచర్స్‌ యూఎస్‌ఏ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు  వెల్లడించలేదు.  అయితే ఈ వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన స్కెచర్స్‌ కంపెనీ రూ.600 కోట్లు వెచ్చించిందని సమాచారం. దీంతో స్కెచర్స్‌ ఇండియా  ఇక పూర్తిగా స్కెచర్స్‌ యూఎస్‌ఏ అనుబంధ

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 14th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యూనిటెడ్‌ బేవరీజెస్‌:- కోర్టు అనుమతితో ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ యూనిటెడ్‌ బేవరీజెస్‌ భాగస్వామ్య సం‍స్థ హీనెకెన్ ఎన్వి ఆస్తులను వేలంవేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.  జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌:- గోల్డ్‌మెన్‌ శాచ్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌కు కేటాయింపుతో పాటు టార్గెట్‌ ధరను రూ.315లకు పెంచింది. గత 6నెలలు 20శాతం దిద్దుబాటుకు గురైన షేరు వాల్యూవేషన్‌ ఆల్‌టైం కనిష్టానికి చేరుకుందని

Most from this category