STOCKS

News


సేవల విస్తృతిపై అపోలో దృష్టి

Thursday 31st January 2019
news_main1548917841.png-23922

అపోలో జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆసుపత్రుల విస్తరణ కంటే సేవల విస్తృతిపైనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్‌ చేస్తామని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న ఆమె ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆసుపత్రుల పరంగా దేశంలో మేమే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. అవసరమైన చోట హాస్పిటల్‌, ఫార్మసీల ఏర్పాటు ప్రక్రియ సహజంగా జరుగుతుంది. దానికంటే ముఖ్యంగా ఇప్పుడున్న మొత్తం ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవటంపై దృష్టి సారిస్తాం. హెల్త్‌ చెకప్స్‌ను ప్రమోట్‌ చేయడం, జన్యు ఔషధాలు, రోగుల ఇంటెస్టిన్‌ (ప్రేగు) అధ్యయనం ప్రధానాంశాలుగా చేసుకున్నాం. ఒక అడుగు ముందుకేసి వైద్య సేవల రంగాన్ని నిర్వచిస్తాం. చెన్నైలో అపోలో ప్రోటాన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ను 150 పడకల సామర్థ్యంతో నెలకొల్పాం. దక్షిణాసియాలో ఇది తొలి ప్రోటాన్‌ థెరపీ సెంటర్‌. క్యాన్సర్‌ చికిత్సలో అత్యాధునిక పెన్సిల్‌ బీమ్‌ టెక్నాలజీని వాడుతున్నాం. లక్నోలో 250 పడకలతో ఏర్పాటవుతున్న ఆసుపత్రి రెండు నెలల్లో ప్రారంభం కానుంది’ అని వెల్లడించారు.



You may be interested

ఫిలిప్పైన్స్‌లో ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌

Thursday 31st January 2019

5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతాం ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ అభినవ్‌ సిన్హా న్యూఢిల్లీ: ఆతిధ్య రంగ దిగ్గజం ఓయో.. ఫిలిప్పైన్స్‌ దేశంలో ప్రవేశించింది. ఆ దేశంలో కార్యకలాపాల కోసం 21 ఫ్రాంచైజ్‌డ్‌, లీజ్‌డ్‌ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయో తెలిపింది. ప్రస్తుతం తాము భారత్‌తో పాటు చైనా, మలేషియా, నేపాల్‌, ఇంగ్లాండ్‌, యూఏఈ, ఇండోనేషియా... మొత్తం ఏడు దేశాల్లో  కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై కేంద్ర దర్యాప్తు?...షేరు మరో 20 శాతం డౌన్‌

Thursday 31st January 2019

ముంబై:- దాదాపు రూ.31వేల కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలపై కార్పోరేట్‌ అఫైర్స్‌ మంత్రిత్వ(ఎం సీ ఏ) శాఖ విచారణకు సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో దివాన్‌ హౌసింగ్‌  షేరు వరుసగా మూడోరోజైన గురువారం కూడా భారీ పతనాన్ని చవిచూసింది. వరుసగా రెండు రోజులపాటు 20 శాతం వరకూ పడిపోయిన ఈ షేరు తాజాగా మరో20శాతం నష్టపోయింది. వివిధ షెల్ కంపెనీల సాయంతో ఆ కంపెనీకి చెందిన ప్రధాన ప్రమోటర్లు రూ.31,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం

Most from this category