STOCKS

News


రిలయన్స్‌ పవర్‌కు రూ.3,558 కోట్ల నష్టం

Monday 10th June 2019
news_main1560152623.png-26197

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ మార్చి త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం రావడం గమనార్హం. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,952 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంత్రక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.840 కోట్లుగా ఉంది. డిబెంచర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాలని ఈ నెల 8న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. 



You may be interested

ఈ షేర్లు కొనొచ్చు

Monday 10th June 2019

ఎన్‌బీసీసీ:    కొనొచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.61 టార్గెట్‌ ధర: రూ.77 ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ నిర్మాణ రంగ కంపెనీ గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.2,353 కోట్లకు పెరగ్గా, నిర్వహణ లాభ మార్జిన్‌ 1 శాతం మేర తగ్గి 7.5 శాతానికి పరిమితమైంది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటంతో నికర లాభం 8 శాతం

ఆయిల్‌, చమురు బ్లాక్‌ల వేలం...

Monday 10th June 2019

ఓఎన్‌జీసీ, వేదాంత, ఆయిల్‌ ఇండియా టాప్‌ ఈ మూడింటికే 30 బ్లాక్‌లు రిలయన్స్‌, బీపీకి కేజీ బేసిన్‌ బ్లాక్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ఇండియా, ఓఎన్‌జీసీతోపాటు అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ తాజాగా ముగిసిన చమురు, గ్యా్స్‌ బ్లాక్‌ల వేలంలో టాప్‌-3గా నిలిచాయి. రెండో దశ ఓపెన్‌ యాక్రేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద 14 ఆయిల్‌, గ్యాస్‌ బ్లాక్‌లు, మూడో దశ ఓఏఎల్‌పీ కింద మరో 18 ఆయిల్‌, గ్యాస్‌, 5 కోల్‌బెడ్‌

Most from this category