STOCKS

News


ఐటీసీపై పాజిటివ్‌ అంటున్న అనలిస్టులు

Monday 29th October 2018
news_main1540799868.png-21562

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం పలు బ్రోకింగ్‌ సంస్థల అనలిస్టులు ఐటీసీపై బుల్లిష్‌గా మారారు. ప్రస్తుత రిస్క్‌రివార్డు నిష్పత్తి ఆనుకూలంగా ఉందని, స్టాకు ఇతర ఎఫ్‌ఎంసీజీ స్టాకులతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌తో లభిస్తోందని భావిస్తున్నారు. 
వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు..


- సిటి: టార్గెట్‌ రూ. 340. స్థిరమైన ఫలితాలు ప్రకటించింది. సిగిరెట్‌ వాల్యూం గ్రోత్‌ ఆరోగ్యకరంగా ఉంది. భవిష్యత్‌ వృద్ధికి సిగిరెట్‌ వాల్యూంలు ప్రేరకంగా పనిచేస్తాయి. షేరు తన ఐదేళ్ల సరాసరి పీఈ కన్నా తక్కువకు ట్రేడవుతోంది. ఇతర ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో పోలిస్తే దాదాపు 30- 35 శాతం డిస్కౌంట్‌లో ఉంది. 
- మోర్గాన్‌స్టాన్లీ: టార్గెట్‌ రూ. 320. సిగిరెట్ల అమ్మకాలు స్థిరమైన వృద్ధి నమోదు చేస్తుండడంతో ధరలు పెంచేందుకు వీలు చిక్కనుంది. సిగిరెట్ల వాల్యూంలో 5 శాతం, ఎబిటాలో 9.3 శాతం వృద్ధి అంచనాలుండగా కంపెనీ ఫలితాల్లో వరుసగా 6, 10 శాతం సాధించింది.
- ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: వరుసగా రెండో త్రైమాసికంలో కూడా సిగిరెట్ల అమ్మకాల్లో మంచి వృద్ది నమోదు చేసింది. ఇతర విభాగాలు సైతం ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఏడాది మొత్తం మీద సిగిరెట్ల వాల్యూం వృద్ధి 3- 4 శాతం ఉండొచ్చు. 
- బీఎన్‌పీ పారిబా: టార్గెట్‌ రూ. 347. రెండంకెల ఎబిటా వృద్ది కొనసాగవచ్చు. ఐదేళ్ల పీఈ ఫార్వర్డ్‌ అంచనాల కన్నా తక్కువకు ట్రేడవుతూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సిగిరెట్ల విభాగంలో మరింత పురోగతి సాధించగలదు.
- మాక్క్వైరీ: టార్గెట్‌ రూ. 367. అన్ని విభాగాల్లో బలమైన రికవరీ సాధించింది. లాభాల బాట పట్టినట్లు భావించవచ్చు. 
- జెఫర్రీస్‌: టార్గెట్‌ రూ. 360. సిగిరెట్ల విభాగం తమ అంచనాల కన్నా తక్కువ వృద్ధి సాధించిందని తెలిపింది. అయితే ఇతర విభాగాలు బలమైన పాజిటివ్‌ వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. అందువల్ల స్టాకుపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపింది. 
- ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: టార్గెట్‌ రూ. 322. ఇతర ఎఫ్‌ఎంసీజీలతో పోలిస్తే మంచి వృద్ది సాధిస్తూ తక్కువ పీఈల వద్ద లభిస్తోంది. ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.
- సీఎల్‌ఎస్‌ఏ: టార్గెట్‌ రూ. 390. బలమైన ఫలితాలు ప్రకటించింది. తదుపరి జీఎస్‌టీ సమావేశాల్లో విపత్తు సెస్‌ విధింపుపై నిర్ణయం కంపెనీకి కీలకంగా మారనుందని తెలిపింది. 


ITC

You may be interested

వెలుగులోకి విద్యుత్‌ షేర్లు

Monday 29th October 2018

ముంబై:- మార్కెట్‌ ర్యాలీ భాగంగా సోమవారం విద్యుత్‌ షేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. బీఎస్‌ఈలో విద్యుత్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50 శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ 2శాతం లాభంతో 1950.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన అదానీ పవర్‌ అత్యధికంగా 20శాతం, టాటా పవర్‌ 14శాతం లాభపడ్డాయి. వాటితో పాటు టోరెంట్‌ పవర్‌

భారీ లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Monday 29th October 2018

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల భారీ ర్యాలీ కారణంగా మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 7.50శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1.00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2572.85)తో పోలిస్తే 7శాతం లాభంతో 2,753.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ 12శాతం లాభపడింది. యూనియన్‌ బ్యాంక్‌ 10శాతం, కెనరా బ్యాంక్‌ 9శాతం,

Most from this category