STOCKS

News


రెడియంట్‌ లైఫ్‌ కేర్‌ చేతికి మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌...

Tuesday 25th December 2018
news_main1545722103.png-23220

  • విలీన కంపెనీ విలువ రూ.7,242 కోట్లు
  • దేశవ్యాప్తంగా 16 ఆస్పత్రులు, 3,200 బెడ్స్‌

న్యూఢిల్లీ: హాస్పిటల్ చెయిన్ మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ను ఆస్పత్రుల నిర్వహణ సంస్థ రేడియంట్ లైఫ్‌కేర్‌ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా ఏర్పడే సంస్థ విలువ సుమారు రూ.7,242 కోట్లుగా ఉండనుంది. పలు లావాదేవీలతో ఈ డీల్‌ జరగనుంది. ప్రస్తుతం రేడియంట్ లైఫ్‌ కేర్‌కు దన్నుగా ఉంటున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్... ఇకపై విలీన సంస్థలో మెజారిటీ వాటాదారుగా మారుతుంది. రేడియంట్ లైఫ్‌ కేర్‌ ప్రమోటరు అభయ్‌ సోయ్‌... విలీన సంస్థకు చైర్మన్‌గా ఉంటారు. మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ప్రమోటర్లయిన అనల్జిత్‌ సింగ్ తదితరులు వైదొలుగుతారు. "రేడియంట్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ కలయికతో ఉత్తర భారతంలో అతి పెద్ద ఆస్పత్రుల నెట్‌వర్క్‌ ఏర్పాటవుతుంది. ఆదాయపరంగా దేశంలోని టాప్ 3 ఆస్పత్రుల నెట్‌వర్క్‌లలో ఒకటిగాను, బెడ్స్‌ పరంగా నాలుగో స్థానంలోనూ ఉంటుంది" అని రేడియంట్ తెలియజేసింది. విలీన సంస్థకు దేశ వ్యాప్తంగా 16 ఆస్పత్రుల్లో 3,200 పైచిలుకు బెడ్స్ (పడకలు) ఉంటాయి. వేల్యుయేషన్ నివేదిక ప్రకారం షేర్ల మార్పిడి నిష్పత్తిని పరిశీలిస్తే... విలీన సంస్థలో కేకేఆర్‌కు 51.9 శాతం, అభయ్‌ సోయ్‌కి 23.2 శాతం, మ్యాక్స్ ప్రమోటర్లకు 7 శాతం వాటాలుంటాయి. మిగతావి పబ్లిక్‌, ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. విలీన సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్ బ్రాండ్‌ పేరుతోనే.. లోగోలో స్వల్ప మార్పులతో కొనసాగుతుందని రేడియంట్ పేర్కొంది.
ఒప్పందం ఇలా..
డీల్ కింద మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన లైఫ్ హెల్త్‌కేర్‌కు ఉన్న 49.7 శాతం వాటాలను నగదు లావాదేవీ ద్వారా రేడియంట్ కొనుగోలు చేస్తుంది. అలాగే, మ్యాక్స్ ఇండియా తమ నాన్‌-హెల్త్‌కేర్ వ్యాపార విభాగాన్ని (మ్యాక్స్ బూపా, అంతర సీనియర్ లివింగ్‌) విడగొట్టి ప్రత్యేక కంపెనీగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేస్తుంది. ప్రస్తుత మ్యాక్స్ ఇండియా షేర్‌ హోల్డర్లకు కొత్త కంపెనీ షేర్లు కూడా దక్కుతాయి. రూ. 2 ముఖ విలువ గల ప్రతి అయిదు మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖ విలువ ఉండే కొత్త కంపెనీ షేరు ఒకటి చొప్పున కేటాయించడం జరుగుతుంది. మరోవైపు, డీమెర్జర్‌ అనంతరం రేడియంట్‌కి చెందిన హెల్త్‌కేర్ అసెట్స్‌ను మ్యాక్స్ హెల్త్‌కేర్‌కు బదలాయిస్తారు. అటుపైన దీన్ని మళ్లీ మ్యాక్స్ ఇండియాలో విలీనం చేసి (రివర్స్ మెర్జర్‌) కొత్త సంస్థను మ్యాక్స్ హెల్త్‌కేర్‌గా కొనసాగిస్తారు. రివర్స్ మెర్జర్ కారణంగా రూ. 2 ముఖవిలువ గల ప్రతి 100 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖవిలువ గల విలీన సంస్థ షేర్లు 99 కేటాయిస్తారు.



You may be interested

మరింత సరళంగా జీఎస్టీ

Tuesday 25th December 2018

మరింత సరళంగా జీఎస్టీ! 12, 18 శాతం శ్లాబులను కలిపేయాలన్న జైట్లీ క్రమబద్ధీకరణ అవసరమని అభిప్రాయం 31 శాతం పన్నుతో దేశాన్ని కాంగ్రెస్‌ అణిచేసిందని విమర్శ న్యూఢిల్లీ: త్వరలో జీఎస్టీ మరింత సరళంగా మారనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంకేతాలిచ్చారు. జీఎస్టీలో 12, 18 శాతం పన్ను శ్లాబులను ఒక్కటి చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘ఆదాయం పెరుగుదల నేపథ్యంలో సాధారణ వినియోగ వస్తువులకు 12- 18 శాతం మధ్య ఒక్కటే

డెడ్‌లైన్‌ డిసెంబర్‌ 31!

Tuesday 25th December 2018

 పాత మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులిక పనిచేయవు జనవరి 1 నుంచి చిప్‌ కార్డులే వారం రోజులే గడువు పాత డెబిట్‌ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. ప్రస్తుతం విరివిగా వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్‌ స్ట్రిప్‌ (మ్యాగ్‌స్ట్రిప్‌) డెబిట్‌ కార్డులు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 తర్వాత నుంచి చెల్లుబాటు కావు. జనవరి 1 నుంచి యూరో పే, మాస్టర్‌కార్డ్, వీసా (ఈఎంవీ) చిప్‌ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో

Most from this category