STOCKS

News


పన్ను వివాదాలు తగ్గుతాయి: పియుష్ గోయల్

Thursday 12th July 2018
news_main1531404543.png-18256

న్యూఢిల్లీ: పన్నుపరమైన వివాదాలపై ఆదాయ పన్ను శాఖ అప్పీళ్లకు సంబంధించిన పరిమితులను పెంచడంతో వ్యాజ్యాలు కొంత మేర తగ్గగలవని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. న్యాయవ్యాజ్యాల్లో చిక్కుకున్న పన్ను మొత్తాల పరిమాణం రూ. 5,600 కోట్ల మేర తగ్గవచ్చని వివరించారు. ప్రస్తుతం వివిధ ట్రిబ్యునల్స్‌, హైకోర్టులు, సుప్రీం కోర్టులో సుమారు రూ. 7.6 లక్షల కోట్ల మేర పన్ను మొత్తాలు లిటిగేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యాజ్యాలను తగ్గించే దిశగా వివాదాస్పద పన్ను మొత్తాలపై ఆదాయ పన్ను శాఖ వివిధ న్యాయస్థానాల్లో అప్పీలు చేయడానికి సంబంధించిన పరిమితులను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ట్రిబ్యునల్‌లో అప్పీలుకు ఈ పరిమితి రూ. 20 లక్షలకు, హైకోర్టుల్లో రూ. 50 లక్షలకు, సుప్రీం కోర్టుల్లో అప్పీలుకు రూ. 1 కోటిగా ఉంటుంది. ఇప్పటిదాకా ట్రిబ్యునల్స్‌లో పరిమితి రూ. 10 లక్షలు, హైకోర్టుల్లో రూ. 20 లక్షలు, సుప్రీం కోర్టులో రూ. 25 లక్షలుగా ఉంది. తాజా నిర్ణయంతో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)లో 41 శాతం మేర, కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ)లో 18 శాతం మేర పన్నుపరమైన వ్యాజ్యాలు తగ్గనున్నాయి. మొత్తం మీద వివిధ న్యాయస్థానాల నుంచి 29,580 కేసులను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.
 



You may be interested

ఫండ్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ వరకు మొదటి మూడు నెలల కాలంలో నికరంగా రూ.1.34 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.93,400 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే గనుక 43 శాతం వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం బలంగా ఉంటోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ‘యాంఫి’ గణాంకాల

బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ గ్రాన్‌ టురిస్మోలో కొత్త వేరియంట్‌

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ‘3 సిరీస్‌ గ్రాన్‌ టురిస్మో’లో కొత్త వేరియంట్‌ ‘320డి గ్రాన్‌ టురిస్మో స్పోర్ట్‌’ కారును భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.46.6 లక్షలు. బీఎండబ్ల్యూ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. 320డి గ్రాన్‌ టురిస్మో స్పోర్ట్‌లో 2 లీటర్‌ 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో

Most from this category