STOCKS

News


యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓగా అమితాబ్‌ చౌదురీ

Saturday 8th September 2018
news_main1536417426.png-20097

నెలల తరబడి ఊహాగానాలకు తెరవేస్తూ కొత్త సీఈఓ, ఎండీని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీగా పనిచేస్తున్న అమితాబ్‌ చౌదురీని తమ కొత్త సీఈఓ, ఎండీగా ఎంచుకున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. 2021 డిసెంబర్‌ 31వరకు ఆయన యాక్సిస్‌బ్యాంక్‌ను నడిపిస్తారు. చౌదురీ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. యాక్సిస్‌బ్యాంక్‌ ప్రస్తుత సీఈఓ శిఖా శర్మ వచ్చే డిసెంబర్‌ ఆఖరులో పదవీవిరమణ చేయనున్నారు. నిజానికి శిఖా శర్మను మరో మూడేళ్లు పొడిగించాలని బ్యాంకు బోర్డు భావించినా ఆర్‌బీఐ అంగీకరించలేదు. అందువల్ల యాక్సిస్‌ కొత్త సీఈఓను ఎంచుకోవాల్సి వచ్చింది. శిఖా శర్మ వారసుడి అన్వేషణకు యాక్సిస్‌ బ్యాంకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎగాన్‌ జెండర్‌ను నియమించుకుంది. 2010 జనవరి నుంచి అమితాబ్‌ చౌదురీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమితాబ్‌ నేతృత్వంలో సంస్థ ఐపీఓ మంచి సక్సెస్‌ నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌- ఆగస్టు కాలంలో చౌదురీ తనకు చెందిన సుమారు 55.77 కోట్ల రూపాయల విలువైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లను విక్రయించారు. కంపెనీ సారధ్యం నుంచి తప్పుకునే ఉద్దేశంతోనే అమితాబ్‌ తన షేర్లను విక్రయించారని ఊహాగానాలు వచ్చాయి. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్‌ పగ్గాలు చేపట్టేందుకు అమితాబ్‌ సంసిద్ధులవుతున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఈవార్తలను నిజం చేస్తూ అమితాబ్‌ నియామకాన్ని యాక్సిస్‌ అధికారికంగా ధృవీకరించింది. త్వరలో అమితాబ్‌ నియామకానికి ఆమోదముద్ర తెలిపేందుకు బ్యాంకు బోర్డు సమావేశం కానుంది.  హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో చేరకముందు అమితాబ్‌ ఇన్ఫోసిస్‌లో పలు విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. బిట్స్‌పిలానీ, అహ్మదాబాద్‌ ఐఐఎంల్లో ఆయన విద్యాభ్యాసం చేశారు. శిఖా శర్మ ఆధ్వర్యంలో యాక్సిస్‌బ్యాంకు మంచి వృద్దినమోదు చేసినా గత రెండేళ్లుగా మొండిపద్దులు పెరుగుతూ వచ్చాయి.  You may be interested

60ల తర్వాతి జీవితం కోసం... కొద్ది మందే పొదుపు

Sunday 9th September 2018

ఉద్యోగ జీవితం మహా అంటే 58-60 వరకే. ఆ తర్వాత మహా అంటే మరో ఐదేళ్లు పార్ట్‌ టైమ్‌గా చేయగలరు. 60 ఏళ్లకు సీనియర్‌ సిటిజన్‌గా మారే వారు, ఆ తర్వాత జీవితం కోసం ముందు నుంచే తగిన నిధిని సమకూర్చుకోవడం ఎంతైనా అవసరం. పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులు, అదే సమయంలో మెరుగైన, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటు ఫలితంగా సగటు జీవన కాలం పెరిగిపోతోంది. కనుక ఎంతలేదనుకున్నా 60ల

కరెక‌్షన్‌ వైపు అడుగులు!?

Saturday 8th September 2018

మార్కెట్‌ అంతిమంగా కరెక‌్షన్‌ వైపు అడుగులు వేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీ, అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు కారణమని తెలిపారు. డాలర్‌ బలపడటం, కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదల, ద్రవ్యల్బోణ అంచనాలు, గ్లోబల్‌గా వడ్డీ రేట్ల పెంపు ధోరణి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణించడం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.   స్టాక్స్‌ కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకున్న తర్వాత పతనం బాటలో పయనిస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే

Most from this category