STOCKS

News


ఎస్‌ఎంఈలపై అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ దృష్టి

Thursday 6th September 2018
news_main1536210029.png-20009

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగుల వ్యయ నియంత్రణ, నిర్వహణ సేవలందిస్తున్న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్‌ఎంఈ)లపై దృష్టిసారించింది. ఉద్యోగుల వేతనాలు, ప్రయోజనాల తర్వాత నియంత్రించగలిగేవి వినోద, ప్రయాణ వ్యయాలేనని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్లోబల్‌ కమర్షియల్‌ సర్వీసెస్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్, జనరల్‌ మేనేజర్‌ శారు కౌశల్‌ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్‌ కార్డ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కంపెనీల వ్యయ భారం తగ్గుతుందని, సుమారు 10 శాతం వరకు వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో 60 శాతం కంటే ఎక్కువ కంపెనీలకు మా కస్టమర్లుగా ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల వ్యాపార సంస్థల తమ సేవలు వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. మన దేశంలో రూ.75 కోట్ల నుంచి రూ.600 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్న ఎస్‌ఎంఈ కంపెనీలు తమ సేవలు వినియోగించుకుంటూ ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల వినోద, ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నాయని తెలిపారు. సుమారు దేశంలో 13 వేల కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని.. ఎంఎంఈ విభాగం వృద్ధి చెందుతుందని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ కంపెనీలతో పాటూ స్టార్టప్స్, ఎస్‌ఎంఈలూ ఉన్నాయి. వీటన్నింటికీ మా వాణిజ్య చెల్లింపుల వ్యాపారం బాగా సెట్‌ అవుతాయి. అందుకే నగరంపై ఫోకస్‌ చేశామని పేర్కొన్నారు.



You may be interested

స్వల్పం పెరిగిన పసిడి

Thursday 6th September 2018

ముంబై:- డాలర్‌ బలహీనతతో పసిడి ధర గురువారం స్వల్పంగా బలపడింది. బ్రెగ్జిట్‌ వార్తలు తెరపైకి రావడంతో బ్రిటీష్‌ పౌండ్‌, యూరో కరెన్సీల విలువ పెరుగుదల కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించింది. ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు మారక విలువ నేడు 0.11శాతం నష్టపోయి 94.97శాతానికి పతనమైంది. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ విలువకు విలోమానుపాతంగా ట్రేడ్‌ అయ్యే పసిడి ధర పుంజుకుంటుంది. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్‌

భారత ప్రేక్షకులకు యూట్యూబ్‌ ‘ఒరిజినల్స్‌’

Thursday 6th September 2018

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో తరహాలో యూట్యూబ్‌ కూడా భారత ప్రేక్షకులకు ప్రత్యేక వీడియోలను అందించే కార్యక్రమానికి ‘ఒరిజినల్స్‌’ కింద శ్రీకారం చుట్టింది. ఇందు కోసం విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో జట్టు కట్టింది. భారత్‌ నుంచి యూట్యూబ్‌ ఒరిజినల్‌ కంటెంట్‌ తీసుకోవడం ఇదే మొదటి సారి. ఇప్పటికే పలు దేశాల్లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఒరిజినల్స్‌ కింద ప్రత్యేక వీడియోలను ఆఫర్‌ చేస్తోంది. కాకపోతే మన దేశంలో

Most from this category