STOCKS

News


అంబుజా సిమెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు

Wednesday 24th October 2018
news_main1540360871.png-21433

న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12.73 శాతం వృద్ధితో రూ.396 కోట్లు, ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.6,097 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.351 కోట్లు, ఆదాయం రూ.5,451 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా 12 శాతం పెరిగి రూ.5,540 కోట్లకు చేరాయి. జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా అంబుజా సిమెంట్స్‌ పాటిస్తోంది. రిటైల్‌ వినియోగదారులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, కీలక మార్కెట్లపై దృష్టి పెట్టడం ద్వారా నికర విక్రయాల్లో 10.4 శాతం వృద్ధిని నమోదు చేశామని అంబుజా సిమెంట్‌ ఎండీ, సీఈవో అజయ్‌కపూర్‌ తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి అస్థిరతల ప్రభావాన్ని వ్యయాల నియంత్రణతో అధిగమించినట్టు చెప్పారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ 5.46 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 5.02 మిలియన్‌ టన్నులుగా ఉంది. జీడీపీ వృద్ధిపై దృష్టి పెట్టడం, ప్రభుత్వం చేపట్టిన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, అందరికీ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్ల కార్యక్రమాలతో సిమెంట్‌కు మంచి డిమాండ్‌ నెలకొందని కపూర్‌ చెప్పారు. ఇది కొనసాగుతుందని, ముందు ముందు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు.  



You may be interested

కొచర్‌కు క్లీన్‌చిట్‌ చెల్లదన్న ఐసీఐసీఐ బ్యాంకు

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు రుణం జారీ వెనుక ప్రయోజనం పొందారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటూ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకున్న చందాకొచర్‌ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమెపై వచ్చిన బంధుప్రీతి ఆరోపణల్లో ఏ మాత్రం సత్యం లేదంటూ 2016 డిసెంబర్‌లో క్లీన్‌చిట్‌ ఇచ్చిన న్యాయ సేవల సంస్థ సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌, తన నివేదికను ఉపసంహరించుకున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది.

ఎన్‌పీఏల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల వరకూ...

Wednesday 24th October 2018

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డ్‌ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్‌పీఏ) సహా బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో సంక్షోభం నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్‌ సమావేశం చర్చించింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌సహా  బోర్డ్‌లోని  పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్‌

Most from this category