STOCKS

News


అమెజాన్‌పై జర్మనీ నియంత్రణ సంస్థ విచారణ

Friday 30th November 2018
news_main1543555717.png-22516

బెర్లిన్‌: థర్డ్‌ పార్టీ విక్రేతల డేటాను తన లబ్ధికి ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలపై యూరోపియన్ కమిషన్ విచారణ ఎదుర్కొంటున్న ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్లో ఆధిపత్యాన్ని అమెజాన్‌ దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై తాజాగా జర్మనీ నియంత్రణ సంస్థ ఫెడరల్ కార్టెల్ ఆఫీస్ దృష్టి సారించింది. పోటీ సంస్థలను తమ ప్లాట్‌ఫాంపై విక్రయించనివ్వకుండా అమెజాన్ అడ్డుకుంటోందన్న అంశంపై విచారణ ప్రారంభించింది. విక్రేతలకు సంబంధించి అమెజాన్ వ్యాపార నిబంధనలు, డేటా వినియోగం మొదలైన అంశాలను పరిశీలించనున్నట్లు ఫెడరల్ కార్టెల్ ఆఫీస్ చీఫ్ ఆండ్రియాస్ తెలిపారు.



You may be interested

ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్ల విక్రయం

Friday 30th November 2018

న్యూఢిల్లీ: భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ... ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్లను విక్రయించింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల్లో భాగంగా ఫ్యూచర్‌ రిటైల్‌కు చెందిన 1.13 శాతం వాటాకు సమానమైన 57 లక్షలకు పైగా షేర్లను భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అమ్మేసింది. ఈ షేర్లను ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌ రూ.300 కోట్లకు కొనుగోలు చేసిందని బీఎస్‌ఈ బ్లాక్‌ డీల్‌ డేటా వెల్లడించింది. ఒక్కో షేర్‌ సగటు విక్రయ విలువ రూ.525.9 గా ఉంది. ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌నకు చెందిన

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవా కేంద్రాల్లో ఆధార్ సర్వీసులు..

Friday 30th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన 3,000 పైచిలుకు కస్టమర్ సర్వీస్ సెంటర్లలో త్వరలో ఆధార్ నమోదు, అప్‌డేషన్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పరికరాలు మొదలైన వాటికి దాదాపు రూ.90 కోట్లు వ్యయం కానుందని, దీనికి యూఐడీఏఐ తోడ్పాటు అందించనుందని ఆయన వివరించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు మూడు నెలలు పట్టొచ్చని శ్రీవాస్తవ చెప్పారు. పరికరాల

Most from this category