STOCKS

News


చైనాలో ఈ-కామర్స్ సేవలు నిలిపివేయనున్న అమెజాన్‌

Wednesday 24th April 2019
news_main1556079699.png-25308

శాన్ ఫ్రాన్సిస్కొ: అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌.. చైనాలో తన ఈ-కామర్స్ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అక్కడి ప్రాంతీయ మార్కెట్లో బలపడిపోయిన ఆలీబాబా, జేడీ డాట్‌ కాం, పిన్‌డ్యూడ్యూ సంస్థలతో పోటీపడలేక తన 15 ఏళ్ల మార్కెట్‌ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ వాటాలో ఆలీబాబాకు 58.2 శాతం ఉండగా.. ఆ రెండు సంస్థలకు 22 శాతం వరకు వాటా ఉంది. ఈ మూడింటి జోరుతో అమెజాన్‌ వెనకపడిపోయిన కారణంగా జూలై 18 నుంచి ఈ-కామర్స్ సేవల విభాగాన్ని నిలిపివేయనుంది. ఇక మిగిలిన సేవలైన వెబ్ సర్వీసెస్‌, కిండ్లీ ఈ-బుక్స్, క్రాస్ బోర్డర్‌ ఆపరేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి.



You may be interested

కొత్తగా 28 ఫ్లయిట్స్‌

Wednesday 24th April 2019

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు నిలిపివేసిన నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థల మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా దేశీయంగా ముంబై, న్యూఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ కొత్తగా 28 ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు స్పైస్‌జెట్ మంగళవారం వెల్లడించింది. ఏప్రిల్‌ 26 నుంచి ఇవి ప్రారంభమవుతాయని పేర్కొంది. ముంబై నుంచి జైపూర్‌, అమృత్‌సర్‌, మంగళూరు, కోయంబత్తూర్‌ రూట్లలో కొత్తగా సర్వీసులు

జెట్ పునరుద్ధరణపై ఆశలు

Wednesday 24th April 2019

- మెజారిటీ వాటాల కొనుగోలుపై  బ్రిటన్ వ్యాపారవేత్త జేసన్‌ ఆసక్తి - సంస్థ సీఈవోకి వినయ్‌ దూబేకు లేఖ న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిల్చిపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణపై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తూ తాజాగా బ్రిటన్ వ్యాపారవేత్త జేసన్ అన్స్‌వర్త్‌.. కంపెనీలో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మెజారిటీ వాటాల కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ జెట్ సీఈవో వినయ్ దూబేకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన దూబే .. ఇతర

Most from this category