STOCKS

News


అమెజాన్‌ ‘ఈజీ’ సేవలు!

Wednesday 29th August 2018
news_main1535519192.png-19738

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా ‘ఈజీ’ పేరుతో కొత్త సర్వీసులను ప్రకటించింది. చిన్న నగరాలు, పట్టణాల్లో కిరాణా, మందుల దుకాణాలు, మొబైల్‌ రీచార్జ్‌ పాయింట్స్‌ వంటి కేంద్రాలతో అమెజాన్‌ చేతులు కలిపి వాటిలో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తోంది.  కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను ఈ ‘ఈజీ’ సెంటర్లలోని కంప్యూటర్ల ద్వారా అమెజాన్‌లో ఆర్డరు చేయొచ్చు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని, డిజిటల్‌ చెల్లింపులు చేయలేని కస్టమర్లకు ఇవి ఉపకరిస్తాయని కంపెనీ తెలిపింది. దుకాణదారుకు ఆర్డరు బట్టి 15 శాతం వరకు కమీషన్‌ వస్తుంది. కస్టమర్ల దగ్గర అదనంగా ఎలాంటి చార్జీలూ వసూలు చేయరు. ఉడాన్‌ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ సేవలు అందిస్తున్నామని అమెజాన్‌ ఇండియా కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తోట మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. 14,000 పైచిలుకు స్టోర్లతో అమెజాన్‌ ఈజీ అనుసంధానమైందన్నారు. 



You may be interested

ఏఆర్‌సీ ఏర్పాటు ఒక్కటే పరిష్కారం

Wednesday 29th August 2018

ముంబై: విద్యుత్‌ రంగానికి సంబంధించి రూ.1.74 లక్షల కోట్ల మొండి బకాయిల (ఎన్‌పీఏలు) విషయంలో బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల మేరకు దివాలా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో... పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ఓ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌/ మేనేజ్‌మెంట్‌ కంపెనీని (ఏఆర్‌సీ/ఏఎంసీ) ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బీవోఏఎంఎల్‌) పేర్కొంది. మార్చి 1 నాటికి ఎన్‌పీఏలుగా మారిన రుణ ఖాతాలకు ఆర్‌బీఐ ఇచ్చిన 180 రోజుల

తగ్గనున్న మొండి బకాయిల భారం

Wednesday 29th August 2018

ముంబై: భారత్‌ బ్యాంకుల స్థూల మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గనుందని  క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ- ఇక్రా విశ్లేషించింది. 2019 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 10 శాతంగా ఉంటుందని అంచనావేస్తోంది. 2018 జూన్‌ 30 నాటికి భారత్‌ బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం 11.52 శాతం. ఇక నికర ఎన్‌పీఏల భారం ఈ ఏడాది జూన్‌ ముగిం‍పు నాటికి 5.92 శాతం ఉంటే 2019 మార్చి నాటికి ఈ రేటు 4.3

Most from this category