STOCKS

News


60 వేల వరకు వడ్డీ లేని రుణం

Friday 21st September 2018
news_main1537503952.png-20424

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో ముందడుగు వేసింది. డిజిటల్‌ పేమెంట్స్‌ సాధనం అయిన అమెజాన్‌ పే తాజాగా అమెజాన్‌ పే ఈఎంఐ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. వాయిదాల్లో చెల్లించేలా అర్హులైన కస్టమర్లకు ఉపకరణాల కొనుగోలుకు రూ.60,000 వరకు రుణం మంజూరు చేస్తారు. క్రెడిట్‌ కార్డు లేని, డెబిట్‌ కార్డు ఉన్నా ఈఎంఐ సౌకర్యం పొందలేని వినియోగదార్ల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన డిజిటల్‌ లెండింగ్‌ స్టార్టప్‌ కంపెనీ క్యాపిటల్‌ ఫ్లోట్‌తో అమెజాన్‌ చేతులు కలిపింది. 3, 6 నెలల వాయిదాల్లో రుణం చెల్లిస్తే ఎటువంటి వడ్డీ ఉండదు. వాయిదాలు ఆరు నెలలు దాటితే కాలాన్నిబట్టి వడ్డీ ఉంటుంది. ప్రాసెసింగ్‌ ఫీజు లేదు. 60 సెకన్లలోనే రుణం జారీ చేస్తారు. ఎక్స్‌చేంజ్‌ ఆఫర్ లేకుండా కనీసం రూ.8,000 ఆపైన ఖరీదైన ఒక ఐటెమ్‌ కొనుగోలుపై మాత్రమే లోన్‌ ఇస్తారు.
రుణం ఇలా పొందండి..
కార్డ్‌లెస్‌ ఈఎంఐ పొందాలంటే అమెజాన్‌ ఐడీ తప్పనిసరి. కొనుగోలు హిస్టరీ ఆధారంగా రుణం ఇచ్చేది నిర్ణయిస్తారు. ఆధార్‌ నంబర్‌, వోటర్‌ ఐడీ లేదా పాన్‌ నంబర్‌ ఉండాలి. కస్టమర్లు ముందుగా అమెజాన్‌ యాప్‌లోకి వెళ్లి అమెజాన్‌ పే ఈఎంఐని ఎంచుకోవాలి. అడిగిన వివరాలు పొందుపరచాలి. ఆధార్‌ నంబరుతో అనుసంధానమైన మొబైల్‌ నంబరుకు ఓటీపీ పంపి వెరిఫై చేసుకుంటారు. ఎంత రుణం వచ్చేది స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. అమెజాన్‌ వెబ్‌సైట్లో వాయిదాల్లో విక్రయానికి ఉన్న ఉత్పత్తిని కార్ట్‌లోకి చేర్చుకోవాలి. చెకింగ్‌ ఔట్‌ సమయంలో ఈఎంఐ మెనులోకి వెళ్లి అమెజాన్‌ పే ఈఎంఐ ఎంచుకోవాలి. ఈఎంఐ ప్లాన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. వాయిదాల చెల్లింపుకు డెబిట్‌ కార్డును అనుసంధానించాలి. 

మొబైల్స్‌ అమ్మకాల్లో 10 శాతం వాటా
భారత మొబైల్స్‌ విక్రయాల్లో 10 శాతం వాటా దక్కించుకున్నట్టు అమెజాన్‌ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో మొబైల్స్‌ అమ్మకాల్లో 33-35 శాతం వాటా చేజిక్కించుకున్నామని అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్స్‌, కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కేటగిరీ లీడర్‌ నిశాంత్‌ సర్దానా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘కంపెనీ వెబ్‌సైట్లో 2,500 రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఇందులో 250 దాకా ఎక్స్‌క్లూజివ్‌ మోడళ్లు ఉంటాయి. ఇన్ని రకాల ఫోన్లను నిల్వ చేయడం రిటైల్‌ దుకాణ వర్తకులకు సాధ్యం కాదు. ఎక్స్‌చేంజ్‌, నెల వాయిదాల్లో ఫోన్లను ఆఫర్‌ చేస్తున్నాం. రూ.500ల కనీస ఈఎంఐతో ఫోన్‌ను కొనుక్కోవచ్చు’ అని తెలిపారు. గతేడాది పండుగల సీజన్‌తో పోలిస్తే ఈసారి రెండింతల అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. 



You may be interested

ఈ ఏడాది రిటైల్‌ లోన్లు 30 శాతం వృద్ధి

Friday 21st September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,500 కోట్ల రిటైల్‌ లోన్లు మంజూరు చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు లక్ష్యం విధించుకుంది. 2017-18తో పోలిస్తే ఇది 30 శాతం అధికమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుప్‌ బాగ్చి తెలిపారు. బ్యాంకు ప్రతినిధులు సుజిత్‌ గంగూలీ, సిద్ధార్థ మిశ్రా, కౌశిక్‌ దత్తా, ప్రశాంత్‌ సింగ్‌, శాంతనూ సమద్దర్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘2018-19లో గృహ రుణాలు 25 శాతం

దీర్ఘకాలంలో మంచిదే .. కానీ..

Friday 21st September 2018

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనంతో స్వల్పకాలికంగా మొండిబాకీలు ఎగియడం వంటి సవాళ్లు ఉంటాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఈ విలీనంతో ప్రయోజనాలు ఉండగలవని వివరించింది. ప్రతిపాదిత విలీనానికి లాంఛనంగా ఆమోదముద్ర వచ్చిన తర్వాత.. రేటింగ్‌ను మదింపు చేస్తామని ఇండియా రేటింగ్స్ తెలిపింది. దేనా బ్యాంక్‌కు తక్కువ మూలధన నిల్వలు ఉన్నప్పటికీ.. విజయా బ్యాంక్‌ వద్ద అధిక

Most from this category