STOCKS

News


ఫ్లిప్‌కార్ట్‌పై అమెజాన్‌ పైచెయ్యి

Thursday 29th November 2018
news_main1543472652.png-22481

ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య పోటీ త్రీవంగా నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో అమెజాన్‌ పైచెయ్యి సాధించింది. స్థూల మర్చండైజ్‌ వ్యాల్యు (జీఎంవీ) పరంగా చూస్తే అమెజాన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ను వెనక్కు నెట్టింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమెజాన్‌ జీఎంవీ 7.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ జీఎంవీ 6.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. బార్‌క్లేస్‌ నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. అయితే మింత్ర, జబాంగ్‌ యూనిట్లను ఫ్లిప్‌కార్ట్‌కు కలుపుకుంటే.. అప్పుడు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ రెండూ సముజ్జీలుగా ఉన్నాయి. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జీఎంవీ దాదాపుగా సమానంగా ఉండేది. అయితే గత ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి అమెజాన్‌ ముందుకు దూసుకెళ్లింది. 
రెవెన్యూ పరంగా చూస్తే.. అమెజాన్‌పై ఫ్లిప్‌కార్ట్‌దే పైచెయ్యి. ఫ్లిప్‌కార్ట్‌ రెవెన్యూ 3.8 బిలియన్‌ డాలర్లుగా ఉంటే.. అమెజాన్‌ రెవెన్యూ 3.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కాగా 16 బిలియన్‌ డాలర్లు చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ 77 శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే అమెజాన్‌ కూడా భారత్‌ మార్కెట్‌ విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉంది. నిర్ణీత కాలంలో ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా జరిగిన విక్రయాల మొత్తం విలువనే జీఎంవీగా పేర్కొనవచ్చు. 



You may be interested

మెటల్‌ షేర్ల తళుకులు

Thursday 29th November 2018

హిందాల్కో, వేదాంత షేర్ల ర్యాలీతో గురువారం మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఫెడ్‌ వడ్డీరేట్లపై పెంపుపై పావెల్‌ వాఖ్యలు  మెటల్‌ షేర్ల ర్యాలీకి కారణమని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకవేళ ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచకపోతే.., రుణాల రేట్ల తగ్గుతాయి. తద్వారా వ్యయాలు తగ్గి వ్యవస్థలో మూలధన లభ్యత కలుగుతుంది. . ఈసారి వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో వ్యయాలు తగ్గవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ

50%పైగా రాబడి అందించే స్టాక్స్‌!!

Thursday 29th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం..  అరబిందో ఫార్మా అరబిందో ఫార్మాపై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,270గా నిర్ణయించాం. అంటే 60 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌ ఉంది. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. వార్షికంగా విక్రయాలు 7 శాతం పెరిగాయి. అయితే ఇదే సమయంలో మార్జిన్లు 21.6 శాతానికి తగ్గితే, నికర లాభం 18 శాతంమేర క్షీణించింది. గత

Most from this category