STOCKS

News


ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ కన్ను

Wednesday 20th March 2019
Markets_main1553060132.png-24702

ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ కన్ను
రూ.35వేల కోట్ల మార్కెట్లోకి త్వరలో రంగప్రవేశం
ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపకల్పన

న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజాలు అమేజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ (వాల్‌మార్ట్‌)లు భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్లో అవకాశాలపై కన్నేశాయి. రూ.35,000 కోట్ల విలువతో, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు అవి సన్నద్ధం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, గ్రోసరీలతో ఈ కామర్స్‌లో ఈ రెండు సంస్థలు భారీ మార్కెట్‌ను సృష్టించుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు గత నాలుగు నెలలుగా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి 2019 ఆరంభం నుంచే ఇవి బీమా ఉత్పత్తులను తీసుకురావాలనుకోగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎఫ్‌డీఐ నిబంధనల కారణంగా ఈ ప్రణాళికలు వాయిదా పడినట్టు తెలిసింది. ‘‘కార్పొరేట్‌ ఏజెన్సీ లైసెన్స్‌ను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అందుకున్నందుకు సంతోషంగా ఉంది. భారత్‌లో ఉన్న అవకాశాలను గుర్తించే పనిలో ఉన్నాం. మా కస్టమర్లకు కావాల్సిన ఇన్సూరెన్స్‌ సొల్యూషన్లపై దృష్టి పెట్టాం’’ అని అమేజాన్‌ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ ఇండియా రెండు కూడా స్టాండలోన్‌ బీమా ఉత్పత్తులను తీసుకురానున్నాయి. అలాగే ఇతర విభాగాల్లోకీ ఇవి ప్రవేశించనున్నాయి. అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రెండూ తమ ప్లాట్‌ఫామ్‌పై ట్రావెల్‌, టికెట్‌ వెర్టికల్స్‌ను కలిగి ఉంటాయి. ప్యాకేజీలో భాగంగా ప్రయాణ బీమాను కూడా అందించనున్నాయి. అలాగే, అధిక విలువైన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల చోరీ, నష్టానికి సంబంధించిన బీమాను కూడా ఆఫర్‌ చేయవచ్చు. సాధారణ, జీవిత బీమా పాలసీల విక్రయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నాయి’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
ఇప్పటికే మొబైల్‌ బీమా విక్రయాలు
నిజానికి ఫ్లిప్‌కార్ట్‌ గతేడాదే బీమా సేవలను ఆరంభించింది. కార్పొరేట్‌ ఏజెంట్‌ లైసెన్స్‌ గతేడాది రాగా, పూర్తి స్థాయి మొబైల్‌ కవరేజీ ప్లాన్‌ను తన ప్లాట్‌ఫామ్‌లపై విక్రయించే మొబైల్స్‌తో పాటు ఆఫర్‌ చేయడం ఆరంభించింది. ఇందుకు బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో టై అప్‌ అయింది. అమేజాన్‌ కూడా అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌తో కలసి ఇదే తరహా బీమా ప్లాన్లను తన ప్లాట్‌ఫామ్‌పై ఆఫర్‌ చేస్తుండడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్సీ బన్సల్‌ అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరం.

 



You may be interested

ఈ పరుగులు చాలాఏళ్లుంటాయ్‌!

Wednesday 20th March 2019

భారత మార్కెట్లు బహుళసంవత్సర ర్యాలీకి రెడీగా ఉన్నాయని ఈక్విటీ ఇంటిలిజెన్స్‌ ఎండీ పొరింజు వెలియత్‌ చెప్పారు. పదేళ్ల కన్సాలిడేషన్‌ అనంతరం మార్కెట్లు మరలా జూలు విదులుస్తున్నాయన్నారు. ఈదఫా ర్యాలీ కనీసం 4-5 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. మార్కెట్లు ఇప్పటికీ పూర్తిగా భారత ఎకానమీలోని సంపూర్ణ పాజిటివ్‌ అంశాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. దేశీయ పెట్టుబడిదారుల కన్నా ఎఫ్‌పీఐలే ఇండియాపై ఎక్కువ నమ్మకంతో ఉన్నారన్నారు. గత ఇరవై రోజుల్లో ఎఫ్‌ఐఐలు ఇండియా

జెట్ ఎయిర్‌వేస్‌లో సంక్షోభం

Wednesday 20th March 2019

- వాటాలు విక్రయించనున్న ఎతిహాద్‌ - ఏప్రిల్‌ 1 నుంచి సేవలు నిలిపేస్తామంటున్న పైలట్లు - గట్టెక్కించేందుకు రంగంలోకి కేంద్రం - నిధులు సమకూర్చాలని బ్యాంకులకు సూచన ముంబై:- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ కూడా ఏదో ఒక ధరకు వాటాలు విక్రయించేసి తప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్‌లో తమకున్న 24 శాతం

Most from this category