STOCKS

News


ఫ్యూచర్‌ రిటైల్‌తో తుది దశకు అమెజాన్‌ సంప్రదింపులు

Wednesday 17th October 2018
news_main1539750424.png-21228

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఈ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ కిషోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా తీసుకోవడం దాదాపు ఖాయమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చర్చలు పురోగతికి చేరాయని, 3-4 వారాల్లో నిర్ణయం వెలువడచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చలు పురోగతిలో ఉన్నాయని, రూ.2,000 కోట్లకు పైగా పెట్టుబడితో వాటా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి. భారత మార్కెట్లో భారీ విస్తరణపై కన్నేసిన అమెజాన్‌ ఇప్పటికే షాపర్స్‌స్టాప్‌లోనూ కొంత వాటా తీసుకుంది. ఫ్యూచర్‌ గ్రూపుతో డీల్‌ ఖరారైతే... భారత రిటైల్‌ రంగంలో అమెజాన్‌కు ఇది మూడో పెట్టుబడి అవుతుంది. గతేడాది షాపర్స్‌ స్టాప్‌ అమెజాన్‌కు ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ రూపంలో జారీ చేసి రూ.179.26 కోట్లను సమీకరించింది. దీంతో షాపర్స్‌ స్టాప్‌లో అమెజాన్‌కు 5 శాతం వాటా దక్కింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విట్‌జిగ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌తో కలసి ఆదిత్య బిర్లా రిటైల్‌కు చెందిన ‘మోర్‌’ను అమెజాన్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్‌లైన్‌ రిటైలర్ల ఆధిపత్యం కలిగిన భారత రిటైల్‌ మార్కెట్లో బలపడేందుకు అమెజాన్‌కు తాజా డీల్‌ ఉపయోగపడుతుందని మార్కెట్‌ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు, భారత రిటైల్‌ మార్కెట్లో వాల్‌ మార్ట్‌ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ మధ్య పోటీ మరింత తీవ్రతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. 



You may be interested

మార్కెట్‌ క్యాప్‌లో రిలయన్సే నంబర్‌1

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి మార్కెట్‌ క్యాప్‌లో దేశంలోనే నంబర్‌ 1 కంపెనీగా నిలిచింది. మంగళవారం ఆర్‌ఐఎల్‌ షేరు 2.09 శాతం పెరిగి రూ.1,163.65 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. టీసీఎస్‌ షేరు 0.64 శాతం లాభంతో 1,961.70 వద్ద స్థిరపడింది. క్లోజింగ్‌ ధర ప్రకారం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,37,576.57 కోట్లుగా ఉంది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,36,105.31 కోట్లు. టీసీఎస్‌ కంటే ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.1,471.26 కోట్లు

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 17th October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- తన ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ రోబూస్ట్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు సెక్యూరిటీస్‌ అలాంట్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరు ధర రూ.298.79ల వద్ద మొత్తం రూ.64లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ గ్రూప్‌కు కేటాయిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అబాన్‌ ఆఫ్‌షోర్స్‌:- యూకే కాంటినెంటల్‌ షెల్ప్‌ ప్రాడెక్ట్స్‌ 100శాతం

Most from this category