STOCKS

News


లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అమెజాన్‌

Wednesday 5th September 2018
news_main1536125203.png-19975

లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా అమెజాన్‌ అవతరించింది. ప్రపంచంలోనే ఈ ఘనతను  సాధించిన రెండో కంపెనీ ఇదే. ఇటీవలే ఐఫోన్‌లు తయారు చేసే యాపిల్‌ కంపెనీ తొలి లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డ్‌ సాధించింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో అమెజాన్‌ షేర్‌ 2 శాతం లాభంతో 2,050 డాలర్లను తాకింది. ఈ ధర వద్ద ఈ కంపెనీ మార్కెట్‌  క్యాప్‌ లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. యాపిల్‌ ఈ ఘనత సాధించిన ఐదు వారాల తర్వాత అమెజాన్‌ ఈ మైలురాయిని దాటింది.
18 డాలర్లకు ఐపీఓ..
1994లో సియాటెల్‌లో జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ను స్థాపించారు. 1997లో 18 డాలర్లకు ఐపీఓకు వచ్చింది. ఇక ఇప్పుడు అమెజాన్‌ షేర్‌ ధర 2,050 డాలర్లను తాకింది. కాగా అమెజాన్‌ షేర్‌ లాభాల్లో ఉండటం ఇది వరుసగా ఏడో రోజు.  ఈ ఏడాదిలో ఇప్పటిదాకా  ఈ షేర్‌ 70 శాతం ఎగసింది.  ఎయిర్‌ బీఎన్‌బీ, నెట్‌ప్లిక్స్‌, యూనిలివర్‌, అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ తదితర సంస్థలు అమెజాన్‌ సిగలోనివే. ఆరంభంలో పుస్తకాలు అమ్మిన అమెజాన్‌ కంపెనీ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇరవై ఏళ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీగా నిలిచింది. అమెజాన్‌ విజయంతో ఈ కంపెనీ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ ప్రపంచం‍లోనే అత్యంత ధనికుడిగా అవతరించాడు. ఈకో వాయిస్‌ డివైస్‌లు, ప్రైమ్‌ మెంబర్షిప్‌ వంటి ఆఫర్ల ద్వారా వినియోగదారుల వి‍శ్వాసాన్ని చూరగొన్నది. ఆన్‌లైన్‌ స్టోర్‌ నిర్వహణకు భారీగా వ్యయాలు అవసరమవుతాయి. కానీ బారీ లాభాలు తెచ్చే వ్యాపారాల కారణంగా ఈ వ్యయాలను అమెజాన్‌ తట్టుకోగలుగుతోంది. ఇక కంపెనీలకు, ప్రభుత్వానికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీసులను అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ అందజేస్తోంది. 


 



You may be interested

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ 9 శాతం క్రాష్‌

Wednesday 5th September 2018

ముంబై:- ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ షేరు బుధవారం భారీగా నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో 109.05 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే తెలియని కారణాలతో ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మకాలకు పూనుకోవడంతో ఏకంగా 9శాతం నష్టపోయి రూ.99.30ల కనిష్టానికి పతనమైంది. అయితే షేరు అమ్మకాలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం గం.11:00కు షేరు గతముగింపు ధర(రూ.109.05)తో పోలిస్తే 8.50 నష్టంతో రూ.99.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా

ఎన్‌బీఎఫ్‌సీలకు ఇక మొండి బండ

Wednesday 5th September 2018

ఇప్పటిదాకా బ్యాంకులను వణికించిన మొండి బకాయిల సమస్య ఇప్పుడు బ్యాంకేతర ఆర్థిక సంస్థలపై (ఎన్‌బీఎఫ్‌సీ-నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ) కూడా గట్టిగానే ప్రభావం చూపించనుంది. కొత్త అకౌంటింగ్‌ నిబంధనలు దీనికి కారణం కానున్నాయి. పాత అకౌంటింగ్‌ పద్ధతిలో బకాయిలు మొండి బకాయిలుగా మారేంత వరకూ వేచి చూసి అప్పుడు కేటాయింపులు జరిపాల్సి ఉండేది. కానీ కొత్తగా అమల్లోకి రానున్న  ద ఇండియాన్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ (ఇండ్‌ యాజ్‌) ప్రకారం భవిష్యత్తులో

Most from this category