News


10 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌

Monday 1st October 2018
news_main1538372072.png-20739

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దసరా, దీపావళి సీజన్‌ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ నెల 10 నుంచి 15 వరకు ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ను నిర్వహిస్తున్నట్లు ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. ఈ సారి కూడా తమ ప్రైమ్‌ కస్టమర్లకు ఈ డీల్స్‌ను, ఆఫర్లను ముందే చూసే అవకాశం ఉంటుందని తెలియజేసింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీల వంటి గృహోపకరణాలు, హోమ్‌-కిచెన్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌ వస్తువులతో పాటు గ్రోసరీ, కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తదితరాలపై ఈ 5 రోజులూ భారీ ఆఫర్లు కొనసాగుతాయని ఈ సందర్భంగా అమెజాన్‌ తెలియజేసింది. అక్టోబరు 10న అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్టివల్‌... అక్టోబరు 15 రాత్రి 11.59కి ముగుస్తుంది. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో చెల్లించేవారికి 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అమెజాన్‌ వాలెట్‌లో సొమ్ము వేస్తే అదనంగా రూ.300 క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, టాటా కెమికల్స్‌ స్టాక్స్‌ కొనచ్చు

Monday 1st October 2018

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: చోళమండలం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.275 టార్గెట్‌ ధర: రూ.743 ఎందుకంటే: వాధ్వాన్‌ గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తున్న ఈ కంపెనీ.. భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల వారికి రుణాలివ్వడంపై దృష్టి సారించే ఏకైక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కూడా ఇదే. 352 నగరాల్లో రూ.1,20,900 కోట్ల నిర్వహణ ఆస్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త గృహాల కొనుగోళ్లు,

మాల్యా ఫోర్స్‌ ఇండియా విక్రయంలో గోల్‌మాల్‌!

Monday 1st October 2018

లండన్‌: లిక్కర్‌ వ్యాపారవేత్త విజయ్‌ మల్యా నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టుకోలేక తంటాలు పడుతున్న భారతీయ బ్యాంకులకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. మాల్యాకు చెందిన ఫార్ములా వన్‌ రేసింగ్‌ టీమ్‌ ఫోర్స్‌ ఇండియా విక్రయంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రధాన బిడ్డర్లలో ఒకటైన రష్యా ఫెర్టిలైజర్‌ గ్రూప్‌ యురాల్కలి ఆరోపించింది. గతవారంలో ఈ వేలం​ ప్రక్రియ పూర్తయింది. అయితే, వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనివల్ల మాల్యాకు రుణమిచ్చిన

Most from this category